»   » అప్పట్లో ఆమె పేరు వింటే మదిలో మన్మధ పూజే! (ఇపుడు 25వ వెడ్డింగ్ యానివర్సరీలో ఇలా)

అప్పట్లో ఆమె పేరు వింటే మదిలో మన్మధ పూజే! (ఇపుడు 25వ వెడ్డింగ్ యానివర్సరీలో ఇలా)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'రాధ..రాధ... మదిలోన మన్మధ పూజ' అప్పట్లో స్టేట్ రౌడీ చిత్రానికి స్వర్గీయ వేటూరిగారు రాసిన ఈ పాట అప్పట్లో హీరోయిన్ రాధపై అభిమానుల్లో ఉన్న అనుభూతులకు అద్దం పట్టింది. అప్పట్లో డాన్సింగ్ సెన్సేషన్ చిరంజీవి అయితే... ఆయనతో పోటీ పడుతూ డాన్సులు చేసే హీరోయిన్ రాధ. రాధ‌ డ్యాన్సులంటే యూత్‌కి ఊపొచ్చేసేది. అందుకే అప్పట్లో వీరిది హిట్ కాంబినేషన్ అయింది. అప్పట్లో వీరి కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి.

హీరోయిన్ గా ఆమె కెరీర్ చాలా హ్యాపీగా సాగుతున్న రోజుల్లోనే నిర్మాత రాజ‌శేఖ‌ర‌న్‌ని వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. వివాహానంత‌రం రాధ సినిమాల‌కు దూర‌మ‌య్యారు. తన ఇద్దరు కూతుళ్లు కార్తీక‌, తుల‌సి, కుమారుడు విఘ్నేష్ పెంపకంతో పాటు కుటుంబ బాధ్యతలు చూసుకోవడానికే ఆమో మొగ్గు చూపారు. మధ్యలో కొన్ని సార్లు మాత్రం బుల్లితెరపై దర్శనమిచ్చారు.

రాధ - రాజ‌శేఖ‌ర‌న్ వివాహం జరిగిన 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల తిరువనంతపురంలోని ఓ రిసార్టులో వెడ్డింగ్ యానివ‌ర్శ‌రీ వేడుక గ్రాండ్ గా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోస్ మీడియాకు రిలీజ్ చేసారు.

రాధ-రాజశేఖరన్ 25వ పెళ్లిరోజు వేడుక

రాధ-రాజశేఖరన్ 25వ పెళ్లిరోజు వేడుక

శుక్రవారం సాయంత్రం రాధ - రాజ‌శేఖ‌ర‌న్ దంప‌తుల‌ 25వ వెడ్డింగ్ యానివ‌ర్శరీ తిరువ‌నంత‌పురంలోని ఓ ప్రయివేటు రిసార్ట్‌లో కొద్దిమంది బంధు మిత్రుల మ‌ధ్య సాదాసీదాగా జ‌రిగింది. ఈ ప‌య‌నం ఎంతో ఇంట్రెస్టింగ్ అంటూ ఆ దంప‌తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులతో రాధ దంపతులు

కుటుంబ సభ్యులతో రాధ దంపతులు

వెడ్డింగ్ యానివర్శరీ వేడుకలో రాధ, రాజశేఖరన్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఇలా ఫోటోలకు ఫోజు ఇచ్చారు. వివాహానంత‌రం రాధ సినిమాల‌కు దూర‌మ‌య్యారు. తన ఇద్దరు కూతుళ్లు కార్తీక‌, తుల‌సి, కుమారుడు విఘ్నేష్ పెంపకంతో పాటు కుటుంబ బాధ్యతలు చూసుకోవడానికే ఆమో మొగ్గు చూపారు.

డాన్సింగ్ క్వీన్

డాన్సింగ్ క్వీన్

అప్పట్లో రాధ‌ డ్యాన్సులంటే చాలా ఫేమస్. అప్పట్లో హీరోయిన్లలో ఆమెను మించిన డాన్సర్ లేదంటే అతిశయోక్తి కాదేమో. డ్యాన్సులు చేస్తే రాధ‌లానే చేయాలి అనేంత‌గా పాపుల‌ర్‌. వెడ్డింగ్ యానివర్శరీలో ఓ పాటకు చిన్నగా స్టెప్స్ వేసారు.

సురేష్ కొండేటి

సురేష్ కొండేటి

తెలుగు సినీ పరిశ్రమ నుండి నిర్మాత సురేష్ కొండేటి రాధ వెడ్డింగ్ యానిర్శరీకి హాజరయ్యారు. నిర్మాత రాజశేఖరన్ కు సురేష్ కొండేటి చాలా క్లోజ్....

పెళ్లి నాటి ఫోటో...

పెళ్లి నాటి ఫోటో...

రాధ కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కల్లారా గ్రామానికి చెందిన వ్యక్తి. నటనపై ఆసక్తితో సినిమాల వైపు వచ్చింది. ఆమె అసలు పేరు ఉదయ చంద్రిక. సినిమాల్లోకి వచ్చాక రాధగా పేరు మార్చుకుని దక్షిణాదిన పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది. 1991లో నిర్మాత రాజశేఖరన్ నాయర్ ను పెళ్లాడింది. వాళ్ల పెళ్లి నాటి పోటోను ఇక్కడ చూడొచ్చు.

వెడ్డింగ్ యానివర్శరీ ఇన్విటేషన్

వెడ్డింగ్ యానివర్శరీ ఇన్విటేషన్

రాధ, రాజశేఖరన్ వెడ్డింగ్ యానివర్శరీ ఇన్విటేషన్ ఇదే.

English summary
check out photos of Actress Radha 25th Wedding Anniversary Celebrations. Radha is an Indian actress popular in the 80s and early 90s.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu