»   » ఐసీయూలో చేరిన నాని హీరోయిన్

ఐసీయూలో చేరిన నాని హీరోయిన్

Written By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : నాని హీరోగా వచ్చిన జెండాపై కపిరాజు చిత్రంలో మెరిసిన కన్నడ భామ రాగిణి ద్వివేది గుర్తుండే ఉండి ఉంటుంది. ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా రాగిణి ద్వివేది ఆసుపత్రి పాలు కావడం కన్నడ సినిమా రంగంలో చర్చనీయాంశమైంది.

తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఫుడ్‌ పాయిజతో హాస్పటిల్ చేరారని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. రాగిణి తల్లి రోహిణి మాట్లాడుతూ... అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించామని మీడియాకు వివరించారు.

ragini

రీసెంట్ గా.... రాగిణి ద్వివేదిపై జేపీ నగర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. రాగిణి ద్వివేదితో పాటు ఆమె సోదరుడుపై నిర్మాత వెంకటేశ్ ఫిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే....'నాటికోలి' సినిమాలో రాగిణి ద్వివేది నటించేందుకు ఆమె సోదరుడు రుద్రాక్షి దీక్షిత్‌ కు రూ.16 నుంచి రూ.17 లక్షలు చెల్లించానని, సినిమా చిత్రీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో డబ్బు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరగా స్పందన లేదని నిర్మాత తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

డబ్బు తిరిగి ఇచ్చేది లేదని, అవసరమైతే మరో సినిమాలో నటిస్తానని రాగిణి చెప్పడంతో పీఎస్ లో ఫిర్యాదు చేసినట్లు నిర్మాత తెలిపాడు. వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

English summary
sandalwood actress Ragini Dwivedi was admitted in ICU at private hospital in bangalore. As per the reports, Ragini was rushed to hospital in an ambulance after she complained of stomach pain. Doctors after conducting tests confirmed that Food poisoning is the reason for her ill health. She is recovering well at the moment.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu