»   »  రంభ ఆత్మహత్యా ప్రయత్నం

రంభ ఆత్మహత్యా ప్రయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rambha
నిన్న చెన్నై లోని ఓ సిటీ హాస్పటిల్ లో హఠాత్తుగా రంభని చాలా సీరియస్ కండీషన్ లో జాయిన్ చేసారు.ఆమె అప్పటికే అపస్మారక స్ధితిలో ఉంది. విశ్వసనీయంగా నిన్న సాయింత్రం ఆమె చెన్నై సాలిగ్రామంలోని ఆమె ఇంటిలో అపస్మారక స్ధితిలో ఉండటం గమినించిన బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఇక ఆమె పాయిజన్ తీసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని ప్రాదిమిక సమాచారం. అయితే ఆమె బంధువులు మాత్రం ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని,ఇప్పుడు బాగానే ఉందని చెప్తున్నారు. అయితే ఆమెని కలవటానికి ఎవరినీ ఎలౌ చేయటం లేదు.

ఒకప్పుడు సౌత్ లో ఒక వెలుగు వెలిగిన పాపులర్ హీరోయిన్ రంభ ఆత్మహత్యా ప్రయత్నం ఆమె అభిమానలును షాక్ కి గురిచేసేదే . అయితే ఈ విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్ ఉంచాలని ఆమె దగ్గరవారు,బంధువులు ప్రయత్నిస్తున్నారు. మీడియాని దగ్గరకి రానివ్వటంలేదు. పుకార్లు పుట్టకుండా మేనేజ్ చేస్తున్నారు. ఇక పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఆమె గత కొద్దికాలంగా డిప్రెషన్ లో ఉందని, ఎవరితోనూ పెద్దగా కలవటానికి ఇష్టపడేది కాదని చెప్తున్నారు. అలాగే నటిగా అవకాశాలు లేకపోవటం,భోజపురిలో లీడింగ్ హీరో రవి కృష్ణన్ తో లవ్ ఫెయిల్యూర్ కావటం ఆమెని భాధ పెట్టాయని ఈ నిర్ణయం తీసుకునేలా చేసాయని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X