కొడుకుతో కలిసి ర్యాంప్ వాక్ చేసిన రమ్యకృష్ణ (ఫోటోస్)
హైదరాబాద్: ఒకప్పుడు సౌత్ సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ అదరొడుతున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' సినిమాలో శివగామిగా ఆమె పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఆమె పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ఎంతో కీలకం అయింది. ఆ పాత్రలో ఆమె తప్ప మరెవరూ సెట్ కారనే విధంగా అద్భుతంగా నటించారు.
ఈ విధంగా రమ్యకృష్ణ గురించి సినిమాలకు సంబంధించిన వార్తలే తప్ప ఆమె పర్సనల్ విషయాలు, కుటుంబ వార్తలేవీ పెద్దగా ప్రచారంలో ఉండవు. దర్శకుడు కృష్ణవంశీని పెళ్లాడిన ఆమె ఇద్దరూ కలిసి కనబడిన సందర్భాలు చాలా తక్కువ. ఈ దంపతులకు రిత్విక్ అనే కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఓ సామాజిక కార్యక్రమంలో తన కొడుకుతో కలిసి సందడి చేసింది రమ్యకృష్ణ. రిత్విక్ తో కలిసి ర్యాంప్ వాక్ చేస్తూ చూపరులు షాక్ అయ్యేలా చేసింది. స్లైడ్ షోలో ఫోటోలు....

ర్యాంప్ వాక్
చెన్నైలో జరిగిన ఓ ఓ సామాజిక కార్యక్రమంలో తన కొడుకుతో కలిసి సందడి చేసింది రమ్యకృష్ణ.

రిత్విక్ తో...
రమ్యకృష్ణ రిత్విక్ తో కలిసి కనిపించడం చాలా అరుదు.

సినిమా రంగానికి దూరంగానే..
కొడుకు రిత్విక్ మీద సినిమా రంగం నీడపడకుండానే పెంచుతున్నారు. అందుకే ఏ సినిమా ఫంక్షన్లో కూడా రిత్విక్ కనిపించడు.

ఫ్యామిలీ
భర్త, కుమారుడితో కలిసి రమ్యకృష్ణ శ్రీవారి దర్శనానికి వచ్చినప్పటి ఫోటో...
వీడియో
కొడుకుతో కలిసి ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియో


Click it and Unblock the Notifications











