»   »  డైరెక్టర్ కథ చెప్పినపుడు నిద్ర పోయేదానిని.. ఈ సీన్‌ను భయంతో చేశాను.. రమ్యకృష్ణ

డైరెక్టర్ కథ చెప్పినపుడు నిద్ర పోయేదానిని.. ఈ సీన్‌ను భయంతో చేశాను.. రమ్యకృష్ణ

Written By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతున్న బాహుబలి సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ పోషించిన శివగామి దేవి పాత్ర ఎంతో కీలకమైనది. శివగామి పాత్ర రమ్యకృష్ణ కెరీర్‌లోనే అత్యుత్తమమైనది. దర్శకుడు రాజమౌళి అంచనాలను తలదన్నేలా ఆ పాత్రను రమ్యకృష్ణ అవలీలగా పోషించింది. బాహుబలి2 ఈ నెల 28న విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రానికి, తన పాత్రకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించింది.

రాజమౌళి కథ చెప్పినపుడు

రాజమౌళి కథ చెప్పినపుడు

సాధారణంగా ఎవరైనా దర్శకుడు నాకు కథ చెప్పినప్పడు నిద్ర అవహిస్తుంటుంది. కానీ, రెండు గంటలపాటు రాజమౌళి చెప్పినప్పుడు నా ఒంటిపై రోమాలు నిక్కపొడుచుకొన్నాయి. నా కెరీర్‌లో నేను నిద్రపోకుండా కథ విన్న సినిమా ఇదేనేమో.

ఎలాంటి కసరత్తు చేయలేదు

ఎలాంటి కసరత్తు చేయలేదు

దర్శకుడు రాజమౌళి ఎలా చెబితే అలా చేశాను. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా ఎలాంటి కసరత్తు చేయలేదు. శివగామి పాత్ర నా కెరీర్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఆ పాత్ర తనకు దక్కడం చాలా అదృష్టం అని రమ్యకృష్ణ అన్నారు. అయితే అయితే ఈ సినిమాలో ఓ సీన్‌ చేసేటపుడు మాత్రం చాలా భయం వేసిందని ఆమె పేర్కొన్నారు.

సీన్ చేయడం కష్టమైంది..

సీన్ చేయడం కష్టమైంది..

బాహుబలి1 సినిమాలో నీటిలో మునిగి బిడ్డను పట్టుకునే సీన్‌ చేయడం చాలా కష్టమైంది. ఆ సన్నివేశాన్ని కేరళలో చల్లకుడి జలపాతం వద్ద షూట్‌ చేశారు. జలపాతం వద్ద అతివేగంగా సుడులు తిరిగేవి. ఆ జలపాతంలోకి దిగి నేను మునిగిపోయి చేతులు బయటకి పెట్టాలి. నీటి వేగం వల్ల నేను అటూ, ఇటూ వెళ్లిపోయేదాన్ని అని రమ్యకృష్ణ గుర్తు చేసుకొన్నది.

వరద ముంచెత్తేది

వరద ముంచెత్తేది

‘శివగామి మొహంలో నేను భయం చూడకూడదు' అని రాజమౌళి ఓ పక్క చెప్పేవారు. మరో పక్క నీటి ప్రవాహం ఉధృతంగా ఉండేది. దాంతో చాలా భయపడుతూ ఆ సీన్‌ను కంప్లీట్‌ చేశా. నీటిలో మునిగినపుడు భయానికి గురైనా పైకి వచ్చినపుడు ధైర్యంగా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాను అని రమ్యకృష్ణ తన అనుభవాలను వెల్లడించింది.

English summary
Actress Ramyakrishna reveals her experiences of Baahubali. Ramyakrishna said that she never attempt any exercise for Shivagami role. According to director instructions, I behaved like that, She added.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X