»   » ఆంటీ అనొద్దు : సుధీర్‌ వార్నింగ్, ఎక్స్ ఫోజింగ్ అంశాలపై రేష్మి స్పందన!

ఆంటీ అనొద్దు : సుధీర్‌ వార్నింగ్, ఎక్స్ ఫోజింగ్ అంశాలపై రేష్మి స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్: అందం, చలాకీతనంతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చకున్న యాంకర్ రష్మి. ఇతర యాంకర్లకు భిన్నంగా హాట్ అండ్ సెక్సీ లుక్స్, ఆకట్టుకునే యాటిట్యూడ్ తో రష్మి ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ పాపులారిటీ ఆమెకు సినిమా అవకాశాలు కూడా బోలెడు తెప్పిపెట్టింది.

  దీంతో పాటు.... రష్మి చుట్టూ బోలెడు రూమర్స్. ఆ రూమర్స్ వల్లే ఆమెకు పాపులారిటీ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో రష్మికి ఎఫైర్ ఉందనే వార్త ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

  రష్మి నటించిన 'తను వచ్చెనంట' మూవీ అక్టోబర్ 21న విడుదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మి సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన చుట్టూ ఉన్న రూమర్స్, వివాదాలపై కూడా స్పందించారు.

  సుధీర్ కు వార్నింగ్ ఇవ్వలేదు

  సుధీర్ కు వార్నింగ్ ఇవ్వలేదు

  జబర్దస్త్ సుడిగాలి సుధీర్ తో రష్మికి ఎఫైర్ ఉందనే వార్త ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల సుధీర్ తనతో కాస్త ఓవర్ గా ప్రవర్తించడంతో రష్మి వార్నింగ్ ఇచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. దీనిపై రష్మి స్పందిస్తూ.... సుధీర్ తో తనకు ఎలాంటి రిలేషన్ షిప్ గానీ, ఎఫైర్ గానీ లేదని... తనకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదని తెలిపారు. జబర్దస్త్ లేదా ఇతర షోలలో వార్నింగ్స్ ఇవ్వడం జరిగిఉండొచ్చు... అది జస్ట్ కామెడీ పండటానికి, స్కిట్ సక్కెస్ కావడానికే తప్ప రియల్ లైఫ్ లో సుధీర్ కు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు, అతనితో ఎలాంటి గొడవలుగానీ, ఎలాంటి రిలేషన్ షిప్ గానీ లేదు అని రష్మి స్పష్టం చేసారు.

  సింగిల్‌గా ఉంటే రూమర్స్

  సింగిల్‌గా ఉంటే రూమర్స్

  ఎంటర్టెన్మెంట్ రంగంలో పెళ్లి కాకుండా సింగిల్ గా ఉంటే ఏదో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుందని...నా విషయంలో కూడా అలానే జరుగుతుందని రేష్మి తెలిపారు. ఇలాంటి రూమర్స్ గురించి నేనేమీ పెద్దగా బాధ పడను. ఇలాంటివి మనకు పబ్లిసిటీ పరంగా ఉపయోగపడాలని సరిపెట్టుకుని బ్రతకాలంతే అని రష్మి అభిప్రాయ పడ్డారు.

  అమెరికా వెళితే అలారాసారు

  అమెరికా వెళితే అలారాసారు

  ఆ మధ్య బసవతారకం హాస్పటల్ ఈవెంటు కోసం అమెరికా వెళితే.... నేను ప్లాస్టిక్ సర్టరీ చేయించుకోవడానికి వెళ్లానని రాసారు. మనం అలాంటివేమీ చేయక పోయినా కాస్త బరువు పెరిగితే ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్నానని, సన్నబడితే లైఫోసక్షన్ చేయించుకున్నానని రాస్తారు అంటూ రష్మి వ్యాఖ్యానించారు.

  ఐటం సాంగ్స్ చేయను స్పెషల్ సాంగ్స్ చేస్తా

  ఐటం సాంగ్స్ చేయను స్పెషల్ సాంగ్స్ చేస్తా

  సినిమాలో ఇపుడు ఎక్కువగా ఐటం సాంగ్స్ ఉండటం లేదు. ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ ఉంటున్నాయి. ఐటం సాంగ్స్ అనే పదం కూడా ఇపుడు ఎవరూ వాటం లేదు. నాకు నచ్చితే స్పెషల్ సాంగులు చేస్తాను అని రష్మి తెలిపారు.

  ఆంటీ అంటే హర్టవుతా

  ఆంటీ అంటే హర్టవుతా

  ఈ ప్రొఫెషన్లో పైకి రావాలంటే చాలా ఓపిక కావాలి. కానీ మనం ఎదగటానికి సమయం పడుతుంది. మహిళలకు వయసు 30 దాటితే ఆంటీ అంటున్నారు, కొందరైతే 30 దాటితే వారు ఎంటర్టెన్మెంట్ రంగానికి పనికి రారు అన్నట్లు రాస్తున్నాు... ఇవన్నీ మమ్మల్ని హర్ట్ చేస్తున్నాయి అని రష్మి తెలిపారు.

  అనసూయతో ఎలాంటి గొడవలు లేవు

  అనసూయతో ఎలాంటి గొడవలు లేవు

  అనసూయకు, నాకు ఎలాంటి గొడవ లేదు, ఇద్దరి మధ్య హెల్దీ ప్రొఫెషన్ ఉంది. అలా అని మేం బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పడం లేదు. మా మధ్య కాంపిటీషన్ లేదు అని రష్మి చెప్పుకొచ్చారు.

  నేనేమీ షేమ్ ఫీల్ కావడం లేదు

  నేనేమీ షేమ్ ఫీల్ కావడం లేదు

  యాంకర్లు ఇలానే ఉండాలి, ఇలాంటి డ్రెస్సులే వేసుకోవాలని ఏమీ లేదు. ఎవరి ఐడెంటి వారికి ఉంటుంది. నేను అలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నందుకు షేమ్ పీల్ కావడం లేదు అని రష్మి ఓ ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

  ఎక్స్ ఫోజింగ్

  ఎక్స్ ఫోజింగ్

  ఎక్స్ ఫోజింగ్, ఎక్స్ ఫోజింగ్ కాదు అనే దానికి లిమిటేషన్స్ ఏమిటో అర్థం కాదు. కొన్ని సార్లు నేను జీన్స్ వేసినా ఎక్స్ ఫోజింగ్ అంటారు అంటూ రష్మి వ్యాఖ్యానించారు.

  జబర్దస్త్ వల్లే...

  జబర్దస్త్ వల్లే...

  జబర్దస్త్ వల్లే తనకు ఇంత గుర్తింపు వచ్చిందని... రష్మి తెలిపారు.

  హారర్ సినిమా కాదు

  హారర్ సినిమా కాదు

  తను వచ్చెంటన సినిమా హారర్ సినిమా కాదు, పూర్తి కామెడీ సినిమా... కాకపోతే జాంబీ అనే కొత్త కాన్సెప్టుతో సినిమా ఉంటుందని రష్మి తెలిపారు.

  English summary
  Actress Rashmi interview about 'Thanu Vachenanta' movie. Thanu Vachenanta Movie / Tanu Vachenanta Movie is an latest telugu movie 2016, Directed by Venkat Kacharla. Produced by Chandra Sekhar Azad Pati Bandla. Music by Ravi Chandra. Starring Teja Kakumanu, Rashmi Goutham and Dhanya Balakrishna.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more