»   » అమీర్‌ఖాన్‌ను ఏడిపించిన రేఖ.. పార్టీలో అసలేం జరిగింది..

అమీర్‌ఖాన్‌ను ఏడిపించిన రేఖ.. పార్టీలో అసలేం జరిగింది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నిర్మించి, నటించిన దంగల్ చిత్రం భారత సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసింది. దంగల్ చిత్ర ఘన విజయాన్ని పురస్కరించుకొని బాలీవుడ్ ప్రముఖులకు భారీ విందును ఏర్పాటు చేశాడు అమీర్ ఖాన్. ఈ సందర్భంగా ప్రముఖ నటి రేఖ తనకు రాసి ఇచ్చిన లేఖను చూసి అమీర్ ఖాన్ కంట్లో నీళ్లు తిరిగాయట.

 రేఖ లేఖను జీవితాంతం దాచుకొంటా..

రేఖ లేఖను జీవితాంతం దాచుకొంటా..

దంగల్ చిత్రాన్ని చూసిన రేఖ తన స్పందనను లేఖ రూపంలో అమీర్ ఖాన్ కు బహుమతిగా ఇచ్చింది. ఆ లేఖను చదివిన అమీర్ భావోద్వేగానికి గురయ్యాడట. ఆ తర్వాత కన్నీటిపర్యంతమయ్యాడట. తన హృదయాన్ని గెలుచుకొన్న లేఖను జీవితాంతం తన వెంట ఉంచుకొంటానని అమీర్ తన సన్నిహితులతో చెప్పినట్టు మీడియా ఓ కథనాన్ని వెల్లడించింది.

దంగల్‌పై ప్రత్యేకతను చాటడానికే..

దంగల్‌పై ప్రత్యేకతను చాటడానికే..

ఎన్నడూ పార్టీలకు హాజరుకాని రేఖ.. దంగల్ చిత్రానికి ఉన్న ప్రత్యేకతను చెప్పడానికే ఆ పార్టీకి హాజరైందట. అమీర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన చిత్రాన్ని చూసి చలించిపోయిందట. కథ, కథనం, నటీనటుల ప్రతిభ రేఖను అమితంగా ఆకట్టుకున్నాయట. దాంతో ఆ చిత్రంలోని అమీర్ నటనను, కళాకారుల ప్రతిభను కొనియాడుతూ లేఖ రాసి ఇచ్చినట్టు సమాచారం.

దంగల్ పార్టీకి సీనియర్ నటులు

దంగల్ పార్టీకి సీనియర్ నటులు

దంగల్ సక్సెస్ పురస్కరించుకొని అమీర్ ఖాన్ బాలీవుడ్ ప్రముఖులకు భారీ విందును ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి సీనియర్ నటులు జితేంద్ర, రేఖ, రణ్‌బీర్ కపూర్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీర్‌కు రేఖ లేఖను అందించింది.

అద్భుత కథకు ప్రముఖుల ప్రశంస

అద్భుత కథకు ప్రముఖుల ప్రశంస

అద్భుతమైన కథతో తెరకెక్కించిన దంగల్‌పై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల కాలంలో పలు అవార్డులను గెలుచుకొన్నది. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు, విమర్శకుల పొగడ్తలను అందుకున్నది. విడుదలైన ప్రతీ చోట భారీ రికార్డు కలెక్షన్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా రూ.743 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా రూ.743 కోట్లు

గతేడాది డిసెంబర్‌లో విడుదలైన దంగల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.743 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దేశవ్యాప్తంగా రూ.541 గ్రాస్ (రూ.369 కోట్లు), ఓవర్సీస్‌లో రూ. 202 కోట్లు వసూలు చేసింది. యూటీవీ, అమీర్ ఖాన్ ప్రొడక్షన్ పై రూపొందిన దంగల్‌లో అమీర్ తోపాటు సాక్షి తన్వర్, సన్య మల్హోత్రాలు ప్రధాన పాత్రలు పోషించారు.

English summary
Rekha presented a special gift to Aamir Khan a special present. Rekha brought a hand written letter for Aamir as she was touched after watching the Dangal movie. Reading that letter Aamir burst emotionally and get tears in eyes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu