»   » ‘షకీలా’గా దర్శనమివ్వబోతున్న సమంత!

‘షకీలా’గా దర్శనమివ్వబోతున్న సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: షకీలా పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది దక్షినాది శృంగార సినిమాలే. ఒకప్పుడు బి గ్రేడ్ సెక్స్ సినిమాలో తన హవా కొనసాగించింది షకీలా. త్వరలో స్టార్ హీరోయిన్ సమంత... షకీలాగా కనిపించబోతోంది. అయితే.. సమంత పోషిస్తోంది మాత్రం శృంగారతార షకీలా పాత్ర మాత్రం కాదు. విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న '10 ఎన్ రథకుల్లా' సినిమాలో సమంత పాత్ర పేరును షకీలాగా చెప్పకుంటుంది.

ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లోని ఓ సీన్ లో హీరో విక్రమ్ నీ పేరేంటి అని అడిగితే షకీలా అని సమాధానమిస్తుంది సమంత. ఆ మాటకొస్తే విక్రమ్ ఈ సినిమాలో తన పేరు జేమ్స్ బాండ్ అని చెప్పుకుంటాడు. మరి సినిమాలో ఇవి వీరి రియల్ పేర్లా, ఆటపట్టించడానికి కావాలని అలా చెప్పుకున్నారా? అనేది సినిమా విడుదలైతే గానీ చెప్పలేం.

Actress Samantha Calls Herself As Shakeela

విక్రమ్, సమంత జంటగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో కలసి మురుగదాస్ '10 ఎన్ రథకుల్లా' చిత్రాన్ని నిర్మిస్తుండగా.. గోలీసోడా ఫేం విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పశుపతి, అభిమన్యు సింగ్ విలన్స్ గా నటిస్తుంటే.. మన సంపూర్ణేష్ బాబు స్పెషల్ రోల్ లో మెరిశాడు. ఛార్మి గానా గానా తెలంగాణ అంటూ సాగే ఓ ఐటమ్ సాంగ్ లో ఆడిపాడింది. అక్షన్ ఎంటర్టెనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల కాబోతోంది.

గతంలో ఓ ప్రెస్ మీట్లో సమంత మాట్లాడుతూ...''తొలిసారిగా విక్రంతో నటిస్తున్నా. నిజానికి ఈ కార్యక్రమం కోసం పలురకాలుగా మేకప్‌ వేసుకుని వచ్చా. కానీ ఇక్కడొచ్చి చూస్తే.. విక్రం మీసమే ఈ కార్యక్రమానికి హైలెట్‌గా మారింది. ప్రతి అంశంలోనూ వైవిధ్యాన్ని కనబరిచే నటుడాయన. బయట ఇలా కనిపిస్తారేగానీ.. నటనలో ఓ శాడిస్ట్‌, ఉగ్రవాది కూడా! సెట్‌లో ఆయన నటనను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఇక దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ కూడా షూటింగ్‌ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు''అని సమంత తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ నిర్మిస్తున్నారు.

    English summary
    Samantha Ruth Prabhu the gorgeous actress has currently shifted base from Tollywood to Kollywood. Currently, she is busy with her upcoming “10 Endrathukulla” Road-action thriller movie which is directed by Vijay Milton. This time, she looks different wearing glasses & her character name is also different than her previous movies. She plays a role of a pathetic driver in the third directorial venture of Vijay Milton. Vikram playing the main lead role in the movie.
    Please Wait while comments are loading...