»   » ప్రభాస్ హీరోయిన్ కు ఫోన్లో వేధింపులు

ప్రభాస్ హీరోయిన్ కు ఫోన్లో వేధింపులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : ప్రభాస్ నటించిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరోయిన్ సంజన . బహుభాషా నటి సంజనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. ప్రతి రోజూ అర్ధరాత్రి దాటిన తరువాత తనకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతూ సందేశాల్ని ఇస్తున్నారని ఆక్రోశించారు.

గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన మొబైల్‌లోని ట్రూ కాలర్‌లో చంద్రు అనే వ్యక్తికి చెందిందని గుర్తించానని చెప్పారు. అనంతరం మరో నంబరు నుంచి అదే వ్యక్తి ఫోన్‌ చేస్తూ వస్తున్నాడని, అది ప్రైవేటు నంబరుగా సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. వేధిస్తోన్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, చిత్రపరిశ్రమ ప్రముఖలను సంప్రదించి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పారు.

సంజనకు కేవలం ఆకతాయిల నుండి మాత్రమేకాదు సినిమా నిర్మాతల నుండి కూడా లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. తన కోరిక తీర్చమంటూ వేధించిన ఓ నిర్మాత బండారం సంజన బయట పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె 'సరదా' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు వన్స్ ఎపానె టైం అనే మరో తెలుగు సినిమాకు కూడా ఆమె కమిటైంది.

బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రంలో తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహోయమ, జగన్ చిత్రాల్లో నటించిన సంజనకు ఒక్క హిట్టూ దక్కక పోవడంతో ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి.

అయితే కన్నడ సినిమాల్లో అమ్మడు ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది. అక్కడ కూడా కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతుండటంతో అవకాశాలు అడపాదడపాగానే రావడం మొదలపెట్టాయి. ప్రస్తుతం సినిమాలు ఏమీ లేక పోవడంతో కన్నడలో ప్రారంభమైన బిగ్ బాస్ షోలో పాల్గొంటోంది.

English summary
Over the past one week, Sanjanaa has been rather distressed. The reason being that a group of men thought it a fun exercise to call her on her personal number day in and out and that too at odd hours in the middle of the night. On occasion, Sanjjanaa picked the call only to be abused by the men. Sanjana first thought to file a police complaint, but she finally decided just to seek the help of her Twitter followers, by posting the number of her harasser.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu