»   » బుజ్జిగాడు సంజన.... మరీ ఇలానా..!? షాకింగ్ గానే ఉంది మరి

బుజ్జిగాడు సంజన.... మరీ ఇలానా..!? షాకింగ్ గానే ఉంది మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాల్లో మేకప్ మ్యాజిక్ గురించి మనకు తెలియంది కాదు. కొన్ని సార్లు మనం చూసేది ఇదివరకు చూసిన నటుడేనా అన్న అనుమానం, ఆశ్చర్యం కలిగే లా ఉంటాయి. కమల్ హసన్ లాంటి యాక్తర్ల విసయం లో అయితే ఇది మరీ ఎక్కువ. అయితే ఆ మేకప్ గ్లామర్ని పెంచి చూపితే పర్లేదు కానీ మరీ డీ గ్లామర్ రోల్ చేసేతప్పుదే వస్తుంది చిక్కు. ఈ విశయం లో హీరోలకు పరవాలేదు కానీ... నటీ మణులకే ఎక్కువ ఇబ్బంది...

ఒక రకంగా డీ గ్లామర్ రోల్ చేయటం హీరోయిన్లకు ఒక చాలెంజ్ అనే అనుకోవాలి. ఇప్పుడా సాహసమే చేయబోతోంది. బుజ్జి గాడు పాప సంజన.సెక్సీభామ కన్నడ, తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో గ్లామర్‌ విరగ పండించేసింది.ఎంత ప్రయత్నం చేసి ఎన్ని అందాలు ఆరబోసినా ఫలితం శూన్యమే అయింది. పాపులర్ అయ్యింది తప్ప హీరోయిన్ గా బిజీ మాత్రం కాలేక పోయింది. "సర్దార్ గబ్బర్ సింగ్" లో నేనూ ఉన్నాను అని చెప్తే తప్ప ఆ సినిమాలో సంజన ఉందన్న విశయమే గుర్తుకు రాదు.

Actress Sanjana Look From Dandupalyam 2

ఇంతకీ, పై ఫొటో ఏ సినిమాలోనిది.? అనే కదా మీ డౌట్‌.? ఇది "దండుపాళ్యం-2" సినిమాలోనిది. గతంలో వచ్చిన 'దండుపాళ్యం' సినిమా మంచి విజయాన్నే అందుకుంది. విమర్శకుల ప్రశంసల్నీ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'దండుపాళ్యం-2'లో సంజన, ఇదిగో.. ఇలా గ్లామర్‌ అస్సలేమాత్రం లేకుండా కన్పించింది.

Actress Sanjana Look From Dandupalyam 2

టూ పీస్‌ బికినీలో గ్లామర్‌ ఒలక బోసిన సంజనని, ఇలా చూడటం కష్టమే. కానీ, సంజన మాత్రం అందరు డీ గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్ లలాగానే ఈ పాత్ర ఒక చాలెంజింగ్ రోల్ అని చెప్తోంది గానీ.... ఫలితం ఏదైనా తేడా వస్తే నిజంగా నే సంజన ఇలా అయిపోతుందేమో అంటూ జోకులు వేస్తున్నారు సంజన స్టిల్స్ చూసిన కొందరు...

English summary
Sanjanaa seems to have joined the robbery gang in Dandupalya sequel, in a deglam avatar to turn a ruthless murderer. Sanjanaa shed her makeup for this sensational film sequel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu