»   » సంజన ని ముంచేసారు: సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్న బుజ్జిగాడు భామ

సంజన ని ముంచేసారు: సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్న బుజ్జిగాడు భామ

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాధారణంగా చిట్ ఫండ్ లాంటి స్కామ్ లు మధ్య తరగతి కుటుంబాలని ముంచేస్తుంటాయి. స్కీములు స్కాములకు బలైపోయేది మధ్యతరగతి ప్రజానీకమే. అయితే ఇప్పుడు ఓ సినీ సెలబ్రిటీ కూడా చిట్ ఫండ్ స్కామ్ లో బలైపోవడం షాకింగ్ గా వుంది. ఆమె ఎవరో కాదు .. బుజ్జిగాడు ఫేం సంజన.

దండుపాళ్యం-2

దండుపాళ్యం-2

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత తాజాగా సంజన దండుపాళ్యం-2 సినిమా ద్వారా తెలుగు తెరపై కనిపించింది. ఈ సినిమాలో న్యూడ్ సీన్లలో నటించిందనే ప్రచారం ద్వారా వార్తల్లో కనిపించిన సంజన ఇలా ఫైనాన్షియల్ గా మోసపోయి మరోసారి వార్తల్లోకొచ్చింది. అయితే ఈ వ్యవహారంలో తాను ఎంత నష్టపోయిందీ మాత్రం సంజన రివీల్ చేయలేదు.

తల్లితో కలిసి

తల్లితో కలిసి

జస్ట్ నష్టపోయాననే విషయం.. దీనిపై తల్లితో కలిసి తాను ఎలా పోరాడుతోందో మాత్రమే తన పోస్టులో బయటపెట్టింది. రీసెంట్ గా కర్ణాటకలో ఓ చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. బెంగుళూరులోని ప్రసిద్ధి చిట్ ఫండ్స్ 300 మంది కుటుంబాలను మోసం చేసి రూ. 17 కోట్ల వరకు స్వాహా చేసింది.

Dandupalyam 2 Movie Leaked Scene, Sanjana Hot video
బాధితుల్లో సంజన కూడా ఉంది

బాధితుల్లో సంజన కూడా ఉంది

ఇందులో మోసపోయిన బాధితుల్లో సంజన కూడా ఉంది. దీనిపై ఆమె సైలెంట్ గా ఉండకుండా సోషల్ మీడియా ద్వారా చిట్ కంపెనీ నిర్వాహకులపై యుద్ధం మొదలెట్టింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బాధితుల్లో తన పేరు ఉందని బయటకు వచ్చినా తానేం పట్టించుకోనని.. ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా మరింత మందికి చేరాలని కోరుకుంది.

సొంత మెర్సిడిస్ బెంజి కారు

సొంత మెర్సిడిస్ బెంజి కారు

చిట్స్ కంపెనీ నడిపిన వాళ్లు బెంగుళూరులో లగ్జరీ లైఫ్ గడిపారని.. సొంత మెర్సిడిస్ బెంజి కారులో తిరిగారని.. బోలెడు ఆస్తులు పోగేసుకున్నారని, గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని , బాదితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది సంజన.

English summary
Prasiddhi Chit Fund Company accused of cheating 50 people including actress Sanjannaa. Company accused of cheating to the tune of Rs 18 crore
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu