»   » ఫరాన్‌తో అఫైర్‌పై మౌనం వీడిన శ్రద్ధాకపూర్.. కుటుంబాన్ని లాగుతారా? మీడియాపై చెడుగుడు..

ఫరాన్‌తో అఫైర్‌పై మౌనం వీడిన శ్రద్ధాకపూర్.. కుటుంబాన్ని లాగుతారా? మీడియాపై చెడుగుడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటుడు ఫరాన్ అఖ్తర్‌తో అఫైర్‌పై అందాల తార శ్రద్ధాకపూర్ మౌనం వీడింది. వారిద్దరూ సహ జీవనం చేస్తున్నారని వార్తలు జోరందుకున్న నేపథ్యంలో శ్రద్ధ కపూర్ మీడియాపై కస్సుబుస్సులాడింది. గాలివార్తలకు కూడా హద్దు పద్దు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పటిలానే ఫరాన్ కేవలం నా స్నేహితుడు మాత్రమే అని శ్రద్ధా వివరణ ఇచ్చింది.

సహజీవనం చేస్తున్నారని...

సహజీవనం చేస్తున్నారని...

శ్రద్ధాకపూర్, ఫర్హాన్ అఖ్తర్‌ల అఫైర్‌పై బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఫరాన్ అఖ్తర్‌తో కలిసి జీవిస్తున్న శ్రద్ధాను ఆమె తండ్రి, నటుడు శక్తికపూర్ బలవంతంగా తీసుకెళ్లాడనే వార్త సంచలనం రేపింది. శ్రద్ధా, ఫరాన్ మధ్య శక్తి కపూర్ విలన్‌లా మారాడని కథనాలు ప్రచురితమయ్యాయి.

కట్టుకథలకు హద్దు ఉండాలి..

కట్టుకథలకు హద్దు ఉండాలి..

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫరాన్ అఖ్తర్‌తో బంధంపై శ్రద్ధా కపూర్ స్పందించాల్సి వచ్చింది. అభూత, కట్టుకథలకు ఓ హద్దు ఉండాలి. మా రిలేషన్‌పై వస్తున్న వార్తలను పట్టించుకోవడం లేదు. కేవలం నా పనిపైనే దృష్టిపెట్టాను అని శ్రద్ధా కపూర్ మీడియాతో చెప్పింది.

మా మధ్య అఫైర్ లేదు..

మా మధ్య అఫైర్ లేదు..

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఫరాన్ అఖ్తర్ బంధం చాలా ముఖ్యమైనది. మా మధ్య మీరనుకుంటున్నట్టు అఫైర్ లేదు. ఫరాన్ కేవలం మంచి స్నేహితుడు మాత్రమే అని శ్రద్దా పేర్కొన్నది. వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం వాటిల్లే విధంగా మీడియా ప్రవర్తించకూడదు. మీడియా అత్యుత్సాహం చూపడం తగదు అని శ్రద్ధాకపూర్ మండిపడింది.

ఐ డోంట్ కేర్..

ఐ డోంట్ కేర్..

ఫరాన్ అఖ్తర్‌తో అఫైర్ అంటూ వచ్చిన రూమర్లు నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కానీ ఈ సారి నా కుటుంబాన్ని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. అందుకే ఇలా స్పందించాల్సి వచ్చింది. నా కుటుంబాన్ని ఇందులోకి లాగడం తగదు అని శ్రద్దా ఆగ్రహం వ్యక్తం చేసింది.

అర్జున్ కపూర్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌గా..

అర్జున్ కపూర్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌గా..

ప్రస్తుతం బాలీవుడ్‌లో శ్రద్ధా కపూర్ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. అర్జున్ కపూర్‌తో హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం మే 19న విడుదలకు సిద్దమవుతున్నది. అలాగే దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న హసీనా సినిమాలోను సైనా నేహ్వాల్ బయోపిక్‌లో నటిస్తున్నది.

English summary
Shraddha Kapoor has rubbished all rumours that she is in a secret relationship with Farhan Akhtar, although she admitted that he was a friend."The link-up rumours have not affected me at all, but this time it did as it involved my family. If you paint a wrong picture and involve family, it's not fair," Shraddha had said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu