»   » గర్భం దాల్చిన హీరోయిన్ స్నేహ, ట్వీట్ చేసిన భర్త

గర్భం దాల్చిన హీరోయిన్ స్నేహ, ట్వీట్ చేసిన భర్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకీ, రాధా గోపాళం, శ్రీరామదాసు, రాజన్న, ఉలవ చారు చిత్రాల ఫేం స్నేహ గర్భం దాల్చింది. నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్నేహ భర్త ప్రసన్న స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఓ సంతోషకరమైన విషయం మీతో పంచుకుంటున్నాను. మా ఫ్యామిలీలోకి త్వరలో కొత్త మెంబర్ జాయిన్ అవుతారు' అంటూ ప్రసన్న ట్వీట్ చేసారు.

స్నేహ వివాహం తమిళ నటుడు ప్రసన్నతో 2012 మే 11న జరిగిన సంగతి తెలిసిందే. 'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, పెళ్లి ద్వారా ఓ ఇంటివారయ్యారు స్నేహ-ప్రసన్న దంపతులు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా స్నేహ తన నట జీవితాన్ని కొనసాగిస్తూ వస్తోంది.

Actress Sneha to become a mom soon

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రసన్న మాట్లాడుతూ...పెళ్లయిన తర్వాత స్నేహ సినిమాల్లో కొనసాగడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఆరునెలలు పోరాడి పెళ్లికి పెద్దలను ఒప్పించామని ప్రసన్న చెప్పారు. ప్రస్తుతం స్నేహ-ప్రసన్న దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది.

పెళ్లి తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె తెలుగులో ముఖ్య పాత్ర పోషించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె గర్భం దాల్చిన నేపథ్యంలో సినిమాలకు కొన్నేళ్ల పాటు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.

English summary
Actress Sneha to become a mom soon. This news was posted by her actor husband Prasanna. “On this special day am extremely happy to share a good news with you all. We are awaiting a new member in the family very soon” posted Prasanna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu