»   » పాపం స్నేహా ఉల్లాల్.. భయంకరమైన వ్యాధితో.. అందుకే కనుమరుగు..

పాపం స్నేహా ఉల్లాల్.. భయంకరమైన వ్యాధితో.. అందుకే కనుమరుగు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార స్నేహా ఉల్లాల్‌ను చూస్తే ఐశ్వర్యరాయ్ జిరాక్స్ కాపీలా ఉంటుంది. 2005 ప్రాంతంలో ఐశ్వర్యరాయ్‌కి దూరమై.. విరహంలో ఉన్న సల్మాన్‌ఖాన్ తన లక్కీ చిత్రంలో ఐష్‌ను గుర్తు చేసే స్నేహా ఉల్లాల్‌ను హీరోయిన్‌గా తీసుకొన్నారనేది బాలీవుడ్ వర్గాలు చెప్పుకొంటారు. లక్కీ: నో టైమ్ ఫర్ లవ్‌ అనే చిత్రంలో ఏకంగా సల్మాన్ పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసిన స్నేహ.. ఆ తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమలో బిజీగా మారింది. ఉల్లాసంగా.. ఉత్సాహంగా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. దాంతో నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నది. తాజాగా తన ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో ఓ షూటింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు.

ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో..

ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో..

చాలా రోజులుగా నేను రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. వైద్యులు నా వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని నిర్ధారించారు. దాంతో నేను శరీరం చాలా బలహీనంగా మారింది. నా కాళ్లపై నేను నిలుచునే పరిస్థితి లేదు. చాలా ఇబ్బందిగా మారింది. ఎక్కువ సేపు నిలబడితే పడిపోయే ప్రమాదం ఉంది. దాంతో సినిమాల్లో నటించడానికి దూరంగా ఉండాలి అని నిశ్చయించుకొన్నాను. సినిమాల్లో నేను కనిపించకపోవడానికి కారణం ఇదే అని స్నేహా ఉల్లాల్ చెప్పారు.

నిలబడటమే కష్టంగా..

నిలబడటమే కష్టంగా..

అతి భయంకరమైన వ్యాధికి గురైనందున కనీసం 30 నిమిషాల కంటే ఎక్కువ నిలబడటం కష్టంగా మారింది. దాంతో నేను సరిగా నడువలేని, పరుగెత్తలేని, డ్యాన్స్ చేయలేని పరిస్థితి తయారైంది. వైద్య చికిత్స అందుతున్నప్పటికీ.. అప్పట్లో రోజురోజుకి నా ఆరోగ్యం దిగజారింది. ఆ కారణంగా నిర్మాతలను ఇబ్బంది పట్టలేకనే సినిమాలకు కొద్ది రోజులు దూరంగా ఉన్నాను అని స్నేహ తన బాధను చెప్పుకొన్నది.

ఆరోగ్య కారణాల వల్ల

ఆరోగ్య కారణాల వల్ల

ప్రస్తుతం నా ఆరోగ్యం కొంత మెరుగైనది. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాను. అందుకే వీలున్నంత మేరకు సినిమాలను అంగీకరిస్తున్నాను. ఇది నాకు సెకండ్ ఇన్నింగ్ అంటే నేను ఒప్పుకోను. ఆరోగ్య కారణాల వల్ల నాకు నేనుగా సినిమాలకు దూరంగా ఉండాలి అని అనుకొన్నాను అని స్నేహ ఉల్లాల్ అభిప్రాయపడింది.

ఆయుష్మాన్ భవలో..

ఆయుష్మాన్ భవలో..

స్నేహా ఉల్లాల్ ప్రస్తుతం ఆయుష్మాన్ భవ అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమలా పాల్ కీలకపాత్రను పోషిస్తున్నారు. చరణ్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నది. ఈ సినిమా ద్వారా మళ్లీ తెలుగులో బిజీ అయ్యే పరిస్థితి, అవకాశం ఉందని ఆమె తెలిపారు.

English summary
As per reports, Actress Sneha Ullal revealed that she was suffering from a blood-related illness called autoimmune disorder which made her body very weak. She added that she wasn't even able to stand up on her feet for more than 30 minutes. This was the main reason behind her break from films. The actress is now working on a Telugu film titled Ayushman Bhava which has Amala Paul playing the lead role. Sneha will play a dual role in the film which is being directed by Charan Tej.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu