twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరిని విస్మరించిన శ్రీదేవి.. దర్శకరత్నకు అగౌరవం.. ట్వీట్ చేసే తీరిక లేదా?

    దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆకస్మిక మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దర్శక దిగ్గజం ఇకలేరంటూ కడసారి తమ పరిధి మేరకు సంతాపాన్ని ప్రకటిస్తూ అశ్రు నివాళులర్పించారు.

    By Rajababu
    |

    దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆకస్మిక మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దాసరిని అభిమానించే ప్రతీ ఒక్కరు గుండెలు పగిలేలా రోదించారు. మరికొందరు విషాదంలో మునిగిపోయారు. దర్శక దిగ్గజం ఇకలేరంటూ కడసారి తమ పరిధి మేరకు సంతాపాన్ని ప్రకటిస్తూ అశ్రు నివాళులర్పించారు. అయితే దాసరి మృతి నేపథ్యంలో సీనియర్ నటి శ్రీదేవి అనుసరించిన తీరుపై నెటిజన్లు, సినీ వర్గాలు భగ్గుమంటున్నారు.

    అగ్రస్థానానికి చేర్చిన..

    అగ్రస్థానానికి చేర్చిన..

    దాసరి అంటే సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ ప్రముఖ వ్యక్తి కాదు. ఓ శక్తి కూడా. అలాంటి మహోన్నతుడైన దాసరి మరణంపై అందాల తార శ్రీదేవి తీరిక లేకపోయిందా అని నిలదీస్తున్నారు. దాసరి దర్శకత్వంలో రూపొందిన ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి లాటి చిత్రాలు శ్రీదేవిని అగ్రస్థానానికి చేర్చాయి. స్టార్ హోదాను ఆ చిత్రాలు కల్పించాయి.

    దాసరిని పట్టించుకోకపోవడంపై

    దాసరిని పట్టించుకోకపోవడంపై

    హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడటానికి టాలీవుడ్ పరిశ్రమ అందించిన చేయూతనే ప్రతీ ఒక్కరు చెప్తుంటారు. ఆమె విజయానికి కారణం దాసరిని శ్రీదేవి పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాసరి మరణంపై సంతాపం ప్రకటించకపోవడంపై నిరసన వ్యక్తమవుతున్నది.

    ట్వీట్ పెట్టే తీరిక లేదా?

    దాసరి తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో అందుబాటులో లేని నటులంతా ట్విట్ల రూపంలోనో, ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారానో తమ అనుబంధాన్ని పంచుకొన్నారు. చిరంజీవి చైనా నుంచి సంతాప ప్రకటనను వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రీదేవికి ఓ ట్వీట్ పెట్టే తీరిక కూడా లేదా అని అంటున్నారు. తాను నటించిన సినిమా గురించి, రాబోయే చిత్రం గురించి ట్వీట్ల వర్షం కురిపించిన శ్రీదేవికి దాసరి గురించి సంతాపం తెలిపే బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు.

    సొంత డబ్బా కొట్టుకొంటూ ట్వీట్లు..

    దాసరి మరణించిన మరుసటి రోజున శ్రీదేవి ట్వీట్టర్‌ను పరిశీలిస్తే పలు పోస్టులు దర్శనమిస్తాయి. మిస్టర్ ఇండియా రిలీజై 30 ఏండ్లు గడిచిపోయింది. అప్పడే ఇన్ని ఏండ్లు అయిపోయాయా? మొన్నమొన్ననే అన్నట్టు ఉన్నది అని ట్వీట్లు చేసింది. అంతేకాకుండా త్వరలో రిలీజ్ కానున్న మామ్ చిత్రానికి సంబంధించిన ట్వీట్లను కూడా చేయడం గమనార్హం. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేయడం కూడా జరిగింది.

    శ్రీదేవి తీరుపై సినీ వర్గాలు అసంతృప్తి

    శ్రీదేవి తీరుపై సినీ వర్గాలు అసంతృప్తి

    రోజంతా తన రాబోయే చిత్రం మామ్ గురించి పోస్టింగులు చేసేందుకు.. రిప్లైలు ఇచ్చేందుకు తీరుబాటు ఉంది కానీ.. దాసరిని గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడకపోవడం దారుణమైన విషయమనే మాట వినిపిస్తున్నది. దర్శకరత్న దాసరి నారాయణరావు మరణాన్ని తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోయింది. పరిశ్రమకు సంబంధించిన ప్రతీ ఒక్కరు స్పందించారు. నేషనల్ మీడియాలో కూడా దాసరి మరణం గురించిన వార్తలు మార్మోగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి మౌన దాల్చడంపై సినీ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.

    English summary
    Many of the Tollywood Industry personalities are showing their dissatisfaction over Actress Sridevi behaviour. Sridevi have not responded to Dasari Narayana's sudden demise. Instead of that she tweet about her movie like Mister India, and Mom.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X