»   »  వివాదమవుతున్న ఫోటో.. హీరోయిన్లు నోరు విప్పరే..

వివాదమవుతున్న ఫోటో.. హీరోయిన్లు నోరు విప్పరే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలనాటి అందాల తార, విలక్షణ నటి సుచిత్రాసేన్‌కు సంబంధించిన అరుదైన ఫోటో ఒకటి ఇంటర్నెట్ విస్తృతంగా ప్రచారమవుతూ వైరల్‌గా మారింది. గతంలో ఎవరి కంటికి చిక్కనటువంటి ఈ ఫొటో సోషల్ మీడియాకు ఎలా చేరిందనే విషయం అంతుపట్టని విధంగా మారింది. ఈ ఫొటో గురించి వివరణ ఇచ్చే భారం ప్రస్తుతం బాలీవుడ్ తారలు, సుచిత్రాసేన్ మనవరాళ్లు రియా, రిమా సేన్‌పై పడింది.

 అంతర్జాతీయ అవార్డు పొందిన ఏకైక నటి

అంతర్జాతీయ అవార్డు పొందిన ఏకైక నటి

భారతీయ సినిమా పరిశ్రమలో అంతర్జాతీయ అవార్డు పొందిన ఏకైక నటి సుచిత్రా సేన్. సప్తపది అనే చిత్రంలో మద్యానికి బానిసైన వ్యక్తి పాత్రను పోషించిన ఆమెకు మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు దక్కింది. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

 అద్భుతమైన పాత్రల్లో ..

అద్భుతమైన పాత్రల్లో ..


సుచిత్రాసేన్ అసలు పేరు రోమా దాస్ గుప్తా. 1931లో ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని పబ్నాలో జన్మించిన ఆమె 2014 జనవరిలో మరణించారు. ఈమె కూతురు ప్రముఖ నటి మున్ మున్ సేన్. తన కెరీర్‌లో పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లో అద్భుతమైన పాత్రలను పోషించారు. ప్రముఖ నటుడు ఉత్తమ్ కుమార్‌తో కలిసి పలు బెంగాలీ క్లాసికల్ చిత్రాల్లో నటించారు. ముసాఫిర్, ఆంధీ, చంపకలీ, బొంబాయి కా బాబు, సర్హద్ లాంటి హిందీ చిత్రాల్లోనూ నటించింది.

 ప్రజా జీవితానికి, మీడియాకు దూరంగా

ప్రజా జీవితానికి, మీడియాకు దూరంగా


1979 నుంచి మీడియాకు, సినీ పరిశ్రమకు దూరంగా ఉండాలని స్వయంగా ఆంక్షలు విధించుకొన్నారు. అప్పటినుంచి ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజా జీవితానికి దూరమైన ఆమె దేశపు అత్యున్నత సినీ అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును తీసుకోవడానికి నిరాకరించారు.

 చనిపోయేంత వరకు కనుపించని తార

చనిపోయేంత వరకు కనుపించని తార


సుచిత్రా సేన్ చనిపోయేంత వరకు ఎవరికీ కనిపించలేదు. ఆమె మరణానికి ముందు గానీ, ఆ తర్వాత గానీ సుచిత్రా సేన్ ఫొటోలను ఆమె కుటుంబసభ్యులు మీడియాకు విడుదల చేసిన దాఖలు లేవు. ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు కూడా అత్యంత రహస్యంగా, గోప్యంగా చికిత్సను అందించారు.

 రహస్యంగా చికిత్స.. అప్పటి ఫోటో వైరల్

రహస్యంగా చికిత్స.. అప్పటి ఫోటో వైరల్


అలాంటి విభిన్నమైన జీవితాన్ని గడిపిన సుచిత్రాసేన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దానిని ఎవరు అప్‌లోడ్ చేశారు. ఎలా వచ్చింది అనే విషయం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై మున్ మున్ సేన్ కుమార్తెలు రియా సేన్, రైమా సేన్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీరు ఈ విషయంపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

English summary
Nobody knew how Suchitra Sen looked after a certain age and even after her death, her family members made sure that none of her pictures are shared with the media. Now, we came across this picture of the actress which has gone viral on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu