»   »  లేచిపోలేదు :మలుపు తిరిగిన నటి లవ్ ఎఫైర్, తల్లిపై చేయి

లేచిపోలేదు :మలుపు తిరిగిన నటి లవ్ ఎఫైర్, తల్లిపై చేయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ :లెజెండ్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, ఉషోదయం, లవ్ వంటి చిత్రాల్లో నటించిన స్వాతి రెడ్డి అంటే గుర్తు పట్టడం కష్టమే. అయితే ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందనే కేసులో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన స్వాతి రెడ్డి అంటే అందరికీ అర్దమవుతుంది.

ఆమెపై డబ్బు, నగలతో శ్రీనివాస్ రెడ్డి అనే గుంటూరు కు చెందిన వ్యక్తితో వెళ్లిపోయినట్టు పోలీస్ కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ లో ...శ్రీనివాస్ రెడ్డి కి ముందే వివాహమై పిల్లలు కూడా ఉన్నట్టు రాసారు. ఇలా కంప్లైంట్ ఇచ్చింది మరెవరో కాదు ఆమె తల్లి నాగేంద్రమ్మ. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.

Actress Swathi Reddy, Mom Come to Blows at Police Station in Hyderabad

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటీ అంటే.. తాను ఇష్టపూర్వకంగానే శ్రీనివాస్ రెడ్డి అనే అతనిని ప్రేమించానని స్వాతిరెడ్డి చెబుతుండం. దాంతో..., శ్రీనివాస్ కు అంతకుముందే పెళ్లయిందని, పిల్లలున్నారని తల్లి నాగేంద్రమ్మ ఫిర్యాదు విషయమై పోలీసులు తల పట్టుకోవాల్సి వచ్చింది.

ఓ ప్రక్క తన కుమార్తెను బలవంతంగా తీసుకువెళ్లాడని, మాయమాటలు చెప్పి నగదు, నగలు అపహరించాడని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే..కూతురే అలాంటిదేమీ లేదని స్వయంగా చెప్పటంతో ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లో పడ్డారు.

Actress Swathi Reddy, Mom Come to Blows at Police Station in Hyderabad

మరో ప్రక్క స్వాతిరెడ్డిని పోలీసులు స్టేషన్ కు పిలిపించగా, ఆమె స్టేషన్ లోనే తన తల్లిపై చెయ్యి చేసుకోవడం సంచలనం కలిగించింది. తన తల్లి, సోదరుడు తనను డబ్బు కోసం వాడుకుంటున్నారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించింది.

అంతేనా ..తాను మద్యం సేవిస్తానని, సిగరెట్లు కాలుస్తానని పోలీసుల ముందు నిర్భయంగా చెప్పిన స్వాతి, వారే మందు కలిపిస్తారని, సిగరెట్ ను అంటిస్తారని వ్యాఖ్యానించింది. తాను ఇష్టపూర్వకంగానే శ్రీనివాస్ తో ఉంటున్నట్టు చెప్పింది. దీంతో ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు.

English summary
Upcoming actress Swathi Reddy who acted in Back Bench Student and currently shooting for Love Telugu movie has Came to Banjara Hills police station with her mother to settle some love issue. Swathi Reddy happens to be a small time Telugu actress and has been living with her partner for some time now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu