»   » బాలయ్య 100వ సినిమాలో తాను లేనని తేల్చేసింది!

బాలయ్య 100వ సినిమాలో తాను లేనని తేల్చేసింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య 99వ సినిమా ‘డిక్టేటర్' ఇటీవల విడుదల కావడం, సంక్రాంతి హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలవడంతో బాలయ్య అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఇపుడు అందరూ బాలయ్య 100వ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం బోయపాటి దర్శకత్వంలోనే ఉంటుందని అంతా ఊహించారు. కానీ వందవ చిత్రాన్ని రోటీన్ గా కాకుండా డిఫరెంటుగా చేయాలని ఫిక్స్ అయ్యారు బాలయ్య.

సింగితం శ్రీనివాసరావు డైరెక్షన్లో ‘ఆదిత్య 999' అనే టైటిల్ తో సైన్స్ షిక్షన్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రం హీరోయిన్ గా తాప్సీ ఎంపికైనట్లు ఇటీవల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే లాంటిదేమీ లేదని తేల్చేసింది తాప్సీ. ఇటీవల జరిగిన సిసిఎల్ మ్యాచ్ కు వచ్చినప్పుడు ఈ విషయమై కొందరు జర్నలిస్టులు తాప్సీని ప్రశ్నిస్తే ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అర్ధం కాదంటూ వ్యాఖ్యానించింది.

Actress Tapsi not part of Balakrishna's 100th

ఆ సంగతి పక్కన పెడితే ఈ చిత్రం ద్వారా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా తెరంగ్రేటం చేయబోతున్నారని టాక్. మోక్షజ్ఞ క్యారక్టర్ ఏమై ఉంటుంది అనే విషయమై ఆల్రెడీ స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమాలో మోక్షజ్ఞ...ఓ పది నిముషాలు పాటు మెరవనున్నారని టాక్. యంగ్ బాలకృష్ణలా అదరకొట్టనున్నారని, చిన్ననాటి బాలకృష్ణలాగా, గణిత మేధావిగా కనిపించి అలరించనున్నాడని అంటున్నారు. అంతేకాదు మరో సైంటిస్ట్ కు టైమ్ ట్రావిలింగ్ విషయంలో తన తెలివితేటలతో సహాకారం కూడా అందించే పాత్రలో కనిపిస్తాడట.

గతంలో బాలకృష్ణ ను కూడా ఎన్టీఆర్ ఇలానే లాంచ్ చేసారు. తాతమ్మ కలలో చిన్న రోల్ తో బాలయ్య తెరంగ్రేటం చేసారు. ఇప్పుడు అదే సెంటిమెంటే తో మెక్షజ్ఞని కూడా తెరగ్రేటం చేయిస్తున్నారు. మరి ఈ యంగ్ లాడ్ ఎలా మురిపిస్తాడో చూడాలి.

English summary
Earlier it was heard that actress Tapsi has been roped for Nandamuri Balakrishna’s 100th movie. But Tapsi has denied the rumour and said that she is not approached for the that movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu