»   » బాలకృష్ణకు కొడుకు పుట్టాడంటూ ప్రచారం: నిజమే కానీ....

బాలకృష్ణకు కొడుకు పుట్టాడంటూ ప్రచారం: నిజమే కానీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో ఏ విషయం అయినా క్షణాల్లో ఇట్టే పాకి పోతోంది. తాజాగా నటుడు బాలకృష్ణకు కొడుకు పుట్టాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

చాలా మంది ఇది నందమూరి బాలకృష్ణకు సంబంధించిన విషయం అనుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు... ఆదర్శ్ బాలకృష్ణ అనే నటుడికి కొడుకు పుట్టాడు. ఏపీ కాంగ్రెస్ పార్టీ లీడర్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి తమ్ముడి కొడుకే ఈ ఆదర్శ్ బాలకృష్ణ. ఆదర్శ్ బాలకృష్ణ గతేడాది ఢిల్లీకి చెందిన గుల్నర్ అనే యువతిని వివాహమాడాడు.

 తమకు కొడుకు పుట్టి విషయమై ఆదర్శ్ బాలకృష్ణ

తమకు కొడుకు పుట్టి విషయమై ఆదర్శ్ బాలకృష్ణ

తమకు కొడుకు పుట్టి విషయమై ఆదర్శ్ బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అతడికి 'నిర్వాణ్ ఆదర్శ్ కృష్ణ' అనే పేరు పెట్టారు.

 క్రికెటర్ కాబోయే నటుడయ్యాడు

క్రికెటర్ కాబోయే నటుడయ్యాడు

ఆదర్శ్ బాలకృష్ణ మంచి క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. కానీ ఆ వైపు కలిసి రాలేదు. చివరకు సినిమాలనే కెరీర్ గా ఎంచుకున్నాడు. తెలుగు చాలా సినిమాల్లో నటించాడు కానీ సరైన గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. హ్యాపీ డేస్ సినిమాలో సీనియర్ బ్యాచ్ లో శ్రావ్స్ లవర్ గా నటించాడు. గోవిందుడు అందరివాడేలే సినిమాలో నెగెటివ్ రోల్ చేసాడు. ఇటీవల విడుదలైన 'సరైనోడు'లోనూ రేపిస్టు రోల్ చేసాడు. ఈ మధ్య చాలా సినిమాల్లో ఆదర్శ్ బాలకృష్ణ చిన్న చిన్న పాత్రల్లో నటించాడు.

 సిసిఎల్ ద్వారా

సిసిఎల్ ద్వారా

బేసిగ్గా ఆటగాడు కావడంతో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో మంచి ఆటతీరు ప్రదర్శించి అందరి మెప్పు పొందాడు ఆదర్శ్ బాలకృష్ణ.

 లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

ఆదర్శ్, గుల్నర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ స్నేహితుడి పెళ్లి కోసం ఢిల్లీ వెళ్లిన ఇతగాడు గుల్నార్ అనే అమ్మాయిని ప్రేమలో పడిపోయాడు. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంటున్నారు.

English summary
Aadarsh Balakrishna is a known actor in the Tollywood industry. Aadarsh and his wife Gulnar were blessed with a baby boy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu