»   » బాలకృష్ణ పెళ్లి నిజమే... బాలయ్య ఫ్యాన్సే కన్ఫ్యూజ్!

బాలకృష్ణ పెళ్లి నిజమే... బాలయ్య ఫ్యాన్సే కన్ఫ్యూజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న బాలకృష్ణ ఒకే ఒక్కరే. నందమూరి నటసింహం బాలకృష్ణ. అయితే బాలకృష్ణ పేరుతో అప్పుడప్పుడూ ఇంకొన్ని పేర్లు కూడా వినిపిస్తుంటారు. అందులో ఓ నటుడి పేరు ఆదర్శ్ బాలకృష్ణ. తెలుగు సినిమాల్లో చిన్నచిన్న విలన్ క్యారెక్టర్లు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేస్తుంటాడు ఇతడు. తాజాగా ఆదర్శ్ బాలకృష్ణ పెళ్లి సెటిలైంది. అయితే చాలా చోట్ల బాలకృష్ణ పెళ్లి సెటిలయిందనే వార్తలు చూసి నందమూరి అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు...కాదు కాదు కొందరు కావాలనే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు వాస్తవం ఇదన్నమాట.

Adarsh Balakrishna to get married on May 28th

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి తమ్ముడి కొడుకే ఈ ఆదర్శ్ బాలకృష్ణ. మంచి క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. కానీ ఆ వైపు కలిసి రాలేదు. చివరకు సినిమాలనే కెరీర్ గా ఎంచుకున్నాడు. తెలుగు చాలా సినిమాల్లో నటించాడు కానీ సరైన గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. హ్యాపీ డేస్ సినిమాలో సీనియర్ బ్యాచ్ లో శ్రావ్స్ లవర్ గా నటించాడు. గోవిందుడు అందరివాడేలే సినిమాలో నెగెటివ్ రోల్ చేసాడు. ఇటీవల విడుదలైన 'సరైనోడు'లోనూ రేపిస్టు రోల్ చేసాడు. ఈ మధ్య చాలా సినిమాల్లో ఆదర్శ్ బాలకృష్ణ చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో మంచి ఆటతీరు ప్రదర్శించి అందరి మెప్పు పొందాడు.

Adarsh Balakrishna to get married on May 28th

ఆదర్శ్ బాలకృష్ణ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మార్చిలోనే అతడికి నిశ్చితార్థం అయింది. మే 28న హైదరాబాద్ లో పెళ్లి జరగబోతోంది. ఇది పెద్దలు కుదర్చిన సంబంధం కాదు. లవ్ మ్యారేజ్. కొన్ని నెలల కిందట ఓ స్నేహితుడి పెళ్లి కోసం ఢిల్లీ వెళ్లిన ఇతగాడు గుల్నార్ అనే అమ్మాయిని ప్రేమలో పడిపోయాడు. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంటున్నారు.

English summary
The Tollywood's actor Adarsh Balakrishna has earned popularity through the movie “Happy Days”, which was directed by Sekhar Kammula.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu