»   » ‘అడ్డా’ సెన్సార్ పూర్తి, 15న విడుదల

‘అడ్డా’ సెన్సార్ పూర్తి, 15న విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సుశాంత్-శాన్వి హీరో హీరోయిన్లుగా శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై జి.కార్తీకరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న 'అడ్డా' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ విషయమై నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ' అడ్డా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఆగస్టు 15న వరల్డ్ వైజ్ రిలీజ్ చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా అద్భుతంగా వచ్చింది. సుశాంత్‌కి, మా బేనర్‌కి 'అడ్డా' బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది' అన్నారు.

ఇటీవల రిలీజైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. త్వరలోనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి బిజినెస్ పరంగా మంచి క్రేజ్ వచ్చింది. బయ్యర్స్ అందరూ మంచి ఆఫర్స్ తో తీసుకున్నారు. తప్పకుండా మా బేనర్లో సూపర్ హిట్ అవుతుంది' అన్నారు.

కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, తాగుబోతు రమేష్, నల్లవేణు, ధన్ రాజ్, స్విప్నిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : ఎస్.అరుణ్ కుమార్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఫైట్స్ : కనల్ కణ్ణన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎం.వి.ఎస్.వాసు, కోడైరెక్టర్ : డి. సాయికృష్ణ, పి.శ్రీను, నిర్మాతలు : చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : జి.కార్తీక్ రెడ్డి.

English summary
Sushanth's up and coming film 'Adda' got the censor process completed and is all set to hit the screens worldwide on the 15th August. The film directed by G.Karthik Reddy and jointly produced by Chintalapudi Srinivasarao and A.Naga Susheela on Sri Nag Corporation banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu