»   » ‘అడ్డా’లో నాగార్జున బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

‘అడ్డా’లో నాగార్జున బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుశాంత్ నటించిన 'అడ్డా' చిత్రం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే కావడంతో ఆయనతో కేక్ కట్ చేయించి ముందస్తుగా బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అడ్డా యూనిట్ సభ్యుల సమక్షంలో నాగార్జున కేక్ కట్ చేసారు.

సుశాంత్-శాన్వి హీరో హీరోయిన్లుగా శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై జి.కార్తీకరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించిన 'అడ్డా' చిత్రం ఆగస్టు 15న విడుదలయింది. సినిమా ఆడియోకు మంచి రెస్పాన్స్ రావడంతో త్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించారు.

కోట శ్రీనివాసరావు, రఘుబాబు, నాగినీడు, తాగుబోతు రమేష్, నల్లవేణు, ధన్ రాజ్, స్విప్నిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : ఎస్.అరుణ్ కుమార్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఫైట్స్ : కనల్ కణ్ణన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎం.వి.ఎస్.వాసు, కోడైరెక్టర్ : డి. సాయికృష్ణ, పి.శ్రీను, నిర్మాతలు : చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : జి.కార్తీక్ రెడ్డి.

నాగార్జున

నాగార్జున

అక్కినేని నాగార్జునకు బొకే ఇచ్చి ‘అడ్డా' చిత్రం త్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకకు ఆహ్వానిస్తున్న చిత్ర నిర్మాతలు. సుశాంత్-శాన్వి జంటగా అడ్డా చిత్రం తెరకెక్కింది. ఆగస్టు 15న అడ్డా చిత్రం విడుదలైంది.

. అడ్డా యూనిట్

. అడ్డా యూనిట్

అడ్డా చిత్రం యూనిట్ సభ్యుల సమక్షంలో పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న నాగార్జున అక్కినేని. చిత్రంలో అడ్డా చిత్ర హీరో సుశాంత్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నిర్మాత నాగ సుశీల తదితరులు ఉన్నారు.

కేక్ కట్ చేస్తున్న నాగార్జున

కేక్ కట్ చేస్తున్న నాగార్జున

అడ్డా త్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ కార్యక్రమంలో కేక్ కట్ చేస్తున్న నాగార్జున. అడ్డా చిత్ర హీరో మరెవరో కాదు...నాగార్జునకు స్వయంగా మేనల్లుడు. చిత్రంలో నాగార్జున సోదరి నాగ సుశీల కూడా ఉన్నారు.

అభిమానులు

అభిమానులు

నాగార్జున పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయన్ను అభిమానులు పూల మాలలతో సత్కరించారు. త్వరలో రాబోతున్న నాగార్జున చిత్రం ‘భాయ్' భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

అనూప్ రూబెన్స్‌తో..

అనూప్ రూబెన్స్‌తో..

అడ్డా చిత్రానికి సూపర్ హిట్ సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్‌ను అభినందిస్తున్న నాగార్జున. అనూప్ రూబెన్స్ మరిన్ని సూపర్ హిట్ లతో మరింత ఎదగాలని నాగార్జున ఆకాంక్షించారు.

English summary
Nag birth day celebrations and Adda Triple platinum disc function held today in Hyderabad. Sushanth-Shanvi starrer Adda directed by G.Karthik Reddy and jointly produced by Chintalapudi Srinivasarao and A.Naga Susheela on Sri Nag Corporation banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu