twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిజల్ట్ ఏంటి?...‘అధినాయకుడు’ హిట్టా..? ఫట్టా?

    By Bojja Kumar
    |

    బాలయ్య నటించిన 'అధినాయకుడు' చిత్రం నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ఎంఎల్ కుమార్ చౌదరి కీర్తి కంబైన్స్ బ్యానర్‌పై నిర్మించారు. బాలకృష్ణ సరసన లక్ష్మిరాయ్ నటించింది. మరి ఈచిత్రానికి ఫిల్మ్ క్రిటిక్స్ ఎలాంటి తీర్పు ఇచ్చారు? ఈ సినిమా హిట్టా? ఫట్టా? యావరేజా? ఒకసారి లుక్కేద్దాం?

    నేషనల్ మీడియా దగ్గర నుంచి ఏపీ మీడియా వరకు ఏ ప్రముఖ వెబ్ సైట్ చూసినా...'అధినాయకుడు' చిత్రాన్ని జస్ట్ యావరేజ్ మూవీగా తేల్చాయి. బాలయ్య మార్క్‌తో కూడిన చిత్రంగా పేర్కొంటున్నాయి. కేవలం ఆయన అభిమానులకు మాత్రమే పూర్తి సంతృప్తిని ఇస్తుంది. బి, సి సెంటర్లకు మాత్రమే పరిమితం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈచిత్రం ఆకట్టుకోలేక పోయిందని రివ్యూల్లో పేర్కొన్నాయి.

    ప్రముఖ జాతీయ మీడియా ఎన్టీటీవీ తన రివ్యూలో....ఈ చిత్రం నిర్మాణపు విలువలు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదని పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా తన రివ్యూలో....ఇందులో పరోక్షంగా తమ ప్రత్యర్థులపై సెట్లరు తప్ప ప్రేక్షకుడిని గొప్పగా ఆశ్చర్యపరిచే అంశాలు ఏమీ లేవు, సగటు ప్రేక్షకుడు భరించడం కష్టమే అని పేర్కొంది.

    ఇక ఐబిఎన్ లైవ్ రివ్యూ విషయానికొస్తే...ఈ చిత్రాన్ని ఒకసారికంటే ఎక్కువ చూడలేం. రెడిక్యులెస్ స్టంట్స్, రాజకీయాలను మించిన ఫ్యామిలీ డ్రామా, ఓవర్ మెలోడ్రామా ఉంది అని పేర్కొంది. ఇండియాస్ నెంబర్ వన్ లాంగ్వేజ్ పోర్టల్ 'వన్ ఇండియా' తన రివ్యూలో....ఈచిత్రం పూర్తిగా బాలయ్య మార్కు సినిమా. అభిమానులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. బాలయ్యకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా కమర్షియల్‌గా కూడా సక్సెస్ కావొచ్చు. డీసెంట్ మూవీ కాకుండా మసాలా ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే వారు ఈచిత్రం నచ్చొచ్చు అని పేర్కొంది.

    ఇక ఇతర తెలుగు వెబ్ సైట్లు, మరికొన్న జాతీయ మీడియా వెబ్ సైట్లు కూడా దాదాపుగా సినిమాకు యావర్ రేజ్ రేటింగ్ ఇచ్చాయి. కొన్నయితే బిలో యావరేజ్ రేటింగుతో సరిపెట్టారు. అయితే చాలా సందర్భాల్లో క్రిటిక్స్ అంచనాలు తలక్రిందులై సినిమాలు భారీగా విజయవంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈచిత్రం భవిష్యత్ ఏమిటో చూడాలి.

    English summary
    Director Parachuri Murali's latest movie Adhinayakudu starring Nandamuri Balakrishna, Lakshmi Rai in the leads, has received average reviews film critics. Balayya’s performance, action and comedy sequences and music are the highlights of the movie. NDTV says...Its production values are low. The characters look like nothing more than a sentient rug. Watch Adhinayakudu only for its loud costumes, pedestrian special effects, unintentional hilarity, rear stall hyperbole, belly buttons - and because you've got nothing else on standby. Oneindia says...It is a Balayya-mark film and would definitely attract his fans. No doubt, the film would go well with the mass audiences. Hence, it will be a commercial success. Watch the film for masala entertainment, but not for a decent view.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X