»   » నువ్వు హీరో ఏంట్రా బాబూ... నువ్వు డైరెక్టర్ ఏంట్రా బాబూ!

నువ్వు హీరో ఏంట్రా బాబూ... నువ్వు డైరెక్టర్ ఏంట్రా బాబూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
"Adhugo" Telugu Movie Pre Teaser Released నువ్వు డైరెక్టర్ ఏంట్రా బాబూ!

డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు ర‌విబాబు పందిపిల్ల సెంట్రిక్ గా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 'అదుగో' అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పందిపిల్లపై సినిమా చేయడం తొలిసారి కావడంతో ఈ విషయం తెలియగానే ఇండస్ట్రీలో సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ప్రముఖ నిర్మాత నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సపోర్ట్ తో ఇలాంటి విలక్షణ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి రవిబాబు సిద్ధమయ్యారు. డి.సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ప్రీ టీజర్

సినిమా ప్రీ టీజర్ పేరుతో రవిబాబు తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో రవిబాబు, పంది పిల్ల ఒకరినొకరు తిట్టుకోవడం ఆసక్తిగా ఉంది. నువ్వు హీరో ఏంట్రా అని పంది పిల్లను ఉద్దేశించి రవిబాబు, నువ్వు డైరెక్టర్ ఏంట్రా అంటూ రవిబాబును ఉద్దేశించి పంది పిల్ల సెటైర్లు వేసుకోవడం ఈ టీజర్లో చూడొచ్చు.


గ్రాఫిక్సే ప్రధానం

గ్రాఫిక్సే ప్రధానం

ఈ సినిమాలో నటించిన పందిపిల్లను రవిబాబు కొంతకాలంగా పెంచుకుంటున్నారు. అయితే సినిమాలో మాత్రం పంది పిల్ల పూర్తి రియల్ గా కాకుండా కొంత గ్రాఫిక్స్ చేసిన కనపడుతుందని ప్రీ టీజర్ చూస్తే స్పష్టం అవుతోంది. సినిమాలో గ్రాఫిక్స్ కోసమే ఎక్కువ ఖర్చు పెట్టారట.


హాలీవుడ్ టెక్నీలజీ

హాలీవుడ్ టెక్నీలజీ

హాలీవుడ్ నుంచి యానిమ్యాట్రిక్స్ టెక్నాలజీని తీసుకొచ్చి సినిమా చేశాడు రవిబాబు. వీఎఫ్ఎక్స్ కోసం భారీ ఖర్చు పెట్టాడు. సినిమాకు రూ. 5 కోట్ల బడ్జెట్ పెడితే అందులో సాగానికంటే ఎక్కువ గ్రాఫిక్స్ కోసమే కేటాయించారట.


అదుగో

అదుగో

అదుగో చిత్ర షూటింగ్ కోసం 40 రోజుల్లో పూర్తి చేసారు. గ్రాఫిక్స్ వర్క పూర్తవ్వడానికి 4 నెలలు సమయం పట్టిందట. మరి పందిపిల్లని నమ్ముకొని రవిబాబు ఈ రేంజ్ లో సినిమా తీసిన ఆయనకు బెస్టాఫ్ లక్ చెబుదాం.English summary
Adhugo Telugu Movie Pre Teaser released. Adhugo movie ft. Ravi Babu. Music by Prashanth Vihari. Directed by Ravi Babu. Suresh Productions presents Adhugo Movie under Flying Frogs Production.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu