»   » స్పేస్ లోకి సెక్సీ బ్యూటీ..భయపడ్డారట, కజకిస్తాన్ లో వరుణ్ తో కలసి!

స్పేస్ లోకి సెక్సీ బ్యూటీ..భయపడ్డారట, కజకిస్తాన్ లో వరుణ్ తో కలసి!

Subscribe to Filmibeat Telugu

ఫిదా చిత్రం నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దశ మారింది. ఆ వెంటనే తొలిప్రేమ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు దర్శక నిర్మాతల దృష్టి వరుణ్ తేజ్ పై పడింది. ఈ మెగా హీరోతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. స్పేస్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. వరుణ్ తేజ్ ఈ చిత్ర ప్రత్యేక మెకోవర్ కోసం కజకిస్థాన్ కు ట్రైనింగ్ కోసం వెళ్ళాడు.

 Aditi Rao Hydari ready to romance with Varun Tej

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ అదితి రావు హైదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఆమెని సంప్రదించి కథ వివరించగానే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అంతరిక్ష పరిశోధనకు సంబందించిన కథ కావడంతో అదితి అంగీకరిస్తుందా లేదా అనే భయంతో ఆమెని అడిగారట. కానీ కథ వినగానే ఆమె ఉత్సాహభరితంగా ఈ చిత్రం చేయడానికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ అంతరిక్షంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితుల్లో నటించాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పటికే వరుణ్ కజకిస్థాన్ కు ట్రైనింగ్ కోసం వెళ్ళాడు. అదితి కూడా కజకిస్థాన్ లో వరుణ్ తో కలసి ట్రైనింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Aditi Rao Hydari ready to romance with Varun Tej. She is the heroine in director Sankalp Reddy movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu