»   » ఆడవాళ్ళ కాలేజీలో చేరిన 'ఆర్య-2' నిర్మాత

ఆడవాళ్ళ కాలేజీలో చేరిన 'ఆర్య-2' నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

'జగడం', 'ఆర్య-2' చిత్రాల నిర్మాత ఆదిత్యబాబు హీరోగా రూపొందిన చలాకీ చిత్రం వచ్చేనెల మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలు మీడియాకు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆదిత్య ఆర్ట్స్ ప్రతినిథి మాట్లాడుతూ... 'మలయాళంలో ఘన విజయం సాధించిన చాక్లెట్ అనే చిత్రంకి రీమేక్. ఈ చిత్రం కథ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. హీరో లేడీస్ కాలేజీలో అడ్మిషన్ సంపాదిస్తాడు. యువకుడు లేడీస్ కాలేజీలో ఎలా, ఎందుకు చేరాడు? దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని అతను ఎలా అధిగమించాడన్న కథాంశంతో ఈ సినిమా రూపొందింది.ఈ చిత్రం ద్వారా ఆదిత్యబాబు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఆదిత్యబాబు, రోమా కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ భాషలో మూడు హిట్ చిత్రాలను నిర్మించిన మాదేష్ డైరక్ట్ చేసారు. ఆదిత్య ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బ్రహ్మనందం, అలీతోపాటు పలువురు ప్రముఖ కమెడియన్లు ఈ చిత్రంలో కనిపిస్తారు. బాలమురుగన్ కెమెరా, హరికృష్ణ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆదిత్య బాబు ఇంతకుముందు ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రాన్ని అంత ఇంతు ప్రీతి బంతు అంటూ కన్నడంలో రీమేక్ చేసి హీరోగా పరిచయమయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu