»   » అమ్మాయిలతో ఆడుకుంటున్న 'ఆర్య 2' నిర్మాత

అమ్మాయిలతో ఆడుకుంటున్న 'ఆర్య 2' నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరిస్థితుల ప్రభావం వల్ల మూడు వేల మంది అమ్మాయిలు చదువుతున్న ఓ డిగ్రీ కాలేజీలో చేరిన నాతో ఆ అమ్మాయిలు ఆడుకున్నారా? లేక నేనే వాళ్లతో ఆడుకున్నానా? అనేది ఆసక్తికర అంశం అంటున్నారు ఆర్య 2 నిర్మాత ఆదిత్య బాబు. ఇదివరకు 'జగడం', 'ఆర్య-2' చిత్రాల్ని నిర్మించిన తాను తొలిసారిగా తెలుగులో కథానాయకుడిగా నటిస్తూ 'చలాకీ' చిత్రాన్ని నిర్మిస్తున్నానని ఆదిత్యబాబు తెలిపారు. ఒక ప్రైవేట్ గెస్ట్‌ హౌస్‌ లో మ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ "ఈ చిత్రంలో నేను సుబ్బారావు అనే చలాకీ కుర్రాడి పాత్ర చేశా. ఈ సబ్జెక్టుని మాదేష్ ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకి చాలా చక్కని స్పందన వచ్చింది. ఈ నెల 20న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు. ఆదిత్యబాబు సరసన రోమా, బియాంక దేశాయ్ హీరోయిన్స్ గా చేసారు. హరికృష్ణ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ...బాలమురుగన్, ఎడిటింగ్...మార్తాండ్ కె. వెంకటేశ్ అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu