Don't Miss!
- News
madam: ఫ్రెండ్ తో పిచ్చపాటిగా ఎంజాయ్, ఇంటికి వెళితే కేజీ నగలు, నగదు, లోలాక్షి ఇల్లు ?
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
దారుణంగా మోసపోయిన నయన్, రమ్యకృష్ణ.. మాయ మాటలను నమ్మి కోట్లు పోగొట్టుకున్నారు!
రియల్ ఎస్టేట్ పేర్లతో సెలెబ్రిటీలను ఈజీగా మోసం చేయవచ్చని కొందరు అనుకుంటారు. సినిమాల్లోనూ ఈ తరహా సీన్లు కనిపిస్తూ ఉంటాయి. బిల్డర్లు అక్రమ భూములను చూపెట్టి కోట్ల సొమ్మును కాజేస్తుంటారు. అలాంటి ఓ ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో సచిన్ టెండూల్కర్ భార్య అంజలి, నయనతార, రమ్యకృష్ణన్ వంటి వారున్నారు. తాజాగా సదరు కంపెనీలోని ఇద్దరు బిల్డర్ల మధ్య విబేధాలు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

హైద్రాబాద్ కేంద్రంగా..
హైద్రాబాద్ కేంద్రంగానే ఈ ఘరానా మోసం జరిగిందని తెలుస్తోంది. హైద్రాబాద్ శివారు ప్రాంతంలోని రావిర్యాలలో కొన్ని భూములును అంజలి, నయనతార, రమ్యకృష్ణన్‌లకు విక్రయించినట్టు తెలుస్తోంది. అవి చెరువుకు సంబంధించిన భూములని, అక్కడ ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి వీలు లేదట. కానీ వారికి మాత్రం ఈ భూములను కట్టబెట్టారట.

అసలు సంగతి ఏంటంటే..
ఆదిత్య హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కోటా రెడ్డి, సుధీర్ రెడ్డి మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దాని వల్ల కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. కోటా రెడ్డి చేసిన మోసాలను సుధీర్ రెడ్డి బహిరంగంగా ప్రకటించాడు. కోటా రెడ్డిపై పోలీసులకు సైతం ఫిర్యాదు ఇచ్చాడు. భారత రత్న సచిన్‌ను మోసం చేసినందుకు గానూ కోటా రెడ్డిపై భారత రాష్ట్రపతికి, ప్రధానికి సుధీర్ రెడ్డి లేఖ కూడా రాశాడట.

వివరాలు ఇలా ఉన్నాయి..
అవి చెరువులకు సంబంధించిన భూములే అయినా వాటిని అత్యధిక రేటుకు అమ్మారని తెలిపాడు. సచిన్‌కు ఆరు ఎకరాలు, రమ్యకృష్ణన్, నయనతారలకు ఒక్కో ఎకరం అమ్మారట. సచిన్‌కు ఆ భూముల సంగతి తెలియదట, ఆ భూములను అభివృద్ది చేస్తానని చెప్పి అమ్మారట. సచిన్ వచ్చి వాటి ప్రారంభోత్సవం కూడా చేశాడని తెలిపాడు.
Recommended Video

స్పందించని తారలు..
అయితే వీటిపై నయన్ గానీ, రమ్యకృష్ణ గానీ ఇంత వరకు స్పందించలేదు. కోట్ల డబ్బు నీళ్ల పాలైనా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారు. అసలే సినిమాలు లోకంగా బతికే వారికి ఇలాంటి మోసాలు, వ్యాపారాల గురించి తెలియదు. మరి ఈ ఘటనపై వీరు స్పందిస్తారా?ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.