»   » రామ్ చరణ్ లేటెస్ట్ 'ఆరెంజ్' తాజా సమాచారం

రామ్ చరణ్ లేటెస్ట్ 'ఆరెంజ్' తాజా సమాచారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రెడీ అవుతున్న 'ఆరెంజ్' చిత్రం ఆడియో రైట్స్ ని ఆదిత్యా మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు. హ్యారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో రైట్స్ ఊహించని పెద్ద మొత్తానికి సోనీయా మ్యూజిక్ వారితో పోటీపడి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఆస్ట్రేలియాలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి పెట్టిన ఓ రేంజి లవ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఈ చిత్రంలో ప్రతీ విషయంలోనూ(హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, స్టైలింగ్) రామ్ చరణ్ కొత్తగా న్యూ స్టైల్ లో కనపడేలా జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో జెనీలియా లీడ్ రోల్ చేస్తోంది. సంచితా శెట్టి...అనే బెంగుళూరుకి చెందిన మోడల్ మరో కీలకమైన పాత్రను చేస్తోంది. ఈ చిత్రాన్ని నాగేంద్రబాబు తన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కెమెరా: కిరణ్‌ రెడ్డి, సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, ఆర్ట్‌: ఆనందసాయి, స్టంట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంభాషణలు: తోట ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: మన్యం రమేష్‌.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu