వేధింపులు, దాడి చేసిన కేసులో మాజీ హీరోకు ఏడాది జైలు

By Srikanya

ముంబై: ఆదిత్యా పాంచోలి, ఆయన కుమారుడు సూరజ్ పాంచోలి ఇద్దరూ కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాంశంతో వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఆదిత్యా పాంచోలి...గతంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పూజా బేడీ ఇంట్లో పనిచేసే మైనర్ బాలీక రేప్ విషయంలోనూ ఆయనకు శిక్ష పడటం సంచలనమే. అఫ్ కోర్స్ ఇప్పుడు కొడుకు జియాఖాన్ ఆత్మహత్య కేసులో ఇరుక్కుని ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆదిత్యా పాంచోలికి ముంబై ..అంధేరీలోని కోర్ట్ ఏడాది జైలు శిక్ష విధించింది. ఆదిత్యకు, అతడి అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ వ్యక్తికి కారు పార్కింగ్‌ స్థలం చిన్నపాటి గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఆదిత్య.. ఆ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన కోర్టు.. 12 యేళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించింది.

వివరాల్లోకి వెళితే... ముంబైలో తన పొరుగున ఉన్న వ్యక్తిపై దాడి జరిపిన కేసులో అతనికి జైలు శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధించింది. అయితే పై కోర్టుకు అప్లయ్ చేసుకునేందుకు ఆయనకు నెలరోజులు గడువు ఇచ్చింది. 2005లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. కాగా, ఈ దాడిలో తన ప్రమేయం లేదని ఆదిత్య పంచోలి తెలిపారు.

Aditya Pancholi gets one year jail in 2005 assault case

ఒక రోజు తన ఫ్రెండ్ ఒకరు తనను చూడటానికి వచ్చి పార్కింగ్ ప్లేస్ ఖాళీగా ఉండటంతో అక్కడ తన కారు పార్క్ చేశాడని, పక్కన ఉన్న టెనెంట్ అతని కారును తన ఫ్రెండ్ కారుముందు పెట్టి రోడ్డును దిగ్బంధం చేశాడని తెలిపారు. తాను అక్కడకు వెళ్లాలని, అంతే కానీ తాను అతనిపై చేయి చేసుకోలేదని తెలిపారు. అయితే ఫిర్యాదుదారు మాత్రం తనపై పంచోలి దాడి చేశాడని, తన ముక్కు నుంచి రక్తం కారడంతో పాటు పలుచోట్ల గాయాలయ్యాయంటూ కంప్లయింట్ చేశారు.

కాగా, దాడి జరిగినదే నిజమైతే అదే రోజు కాకుండా ఆ మరుసటి రోజు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆదిత్య పంచోలి ప్రశ్నించారు. కాగా, ఈ కేసుపై సుదీర్ఘ విచారణ అనంతరం పంచోలికి దోషిగా నిర్దారిస్తూ అంథేరీ కోర్టు ఏడాది జైలు, జరిమానా విధించింది. అయితే తక్షణ బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.

రూ.12,000 బెయిల్ మొత్తాన్ని చెల్లించడంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. వివాదాల్లో చిక్కుకోవడం ఆదిత్య పంచోలికి ఇది మొదటిసారి కాదు. 2013లోనూ పొరుగున ఉన్న ఒక వ్యక్తిపై దాడి చేసినట్టు ఆయనపై కేసు నమోదైంది. 2015లో తాగినమైకంలో ఒక పబ్ బౌన్సర్‌పై దాడి చేసినట్టు కూడా ఆదిత్య పంచోలిపై కేసు నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X