»   » జియా డెత్: సిసిటీవీలో దొరికిపోయిన పంచోలి..(ఫోటోలు)

జియా డెత్: సిసిటీవీలో దొరికిపోయిన పంచోలి..(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ డెత్ కేసులో రోజు రోజుకు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జియా ఖాన్ మృతదేహంపై గాయాలుండటంతో ఇది హత్యే అని అందుకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసిన జియా ఖాన్ మదర్ రబియా ఖాన్, తాజాగా మీడియాకు మరిన్ని సాక్ష్యాలు విడుదల చేసింది.

జియా ఖాన్ ప్రియుడు సూరజ్ పంచోలి తండ్రి ఆదిత్య పంచోలి....జియా ఖాన్ మృతిచెందిన రోజు రాత్రి ఆమె అపార్టుమెంటుకు వచ్చిన విషయం సిసీటీవీలో రికార్డయింది. అందుకు సంబంధించిన దృశ్యాలను రబియా ఖాన్ మీడియాకు విడుదల చేసారు. డైలాభాస్కర్ అనే మీడియా సంస్థ ఈ సీసీటీవీ పుటేజీలను సంపాదించింది.

ఇందులో రబియా ఖాన్ కాస్త డిస్ట్రబ్ అయి ఇంట్లోకి ఎంటరైనట్లు ఉంది. ఆదిత్య పంచోలి ఓ పార్టీలో ఆమె వెంటే ఉన్నారు....ఆ తర్వాత అతను జియా ఖాన్ ఉండే సంగీత్ సాగర్ అపార్ట్‌మెంటుకు వచ్చారు. అయితే ఆయన ఇంట్లోకి ఎంటర్ అయ్యాడా? లేదా లాబీలో వెయిట్ చేసారా అనేది సరిగా కనిపించడం లేదు.

కెమెరా ఉన్న విషయ తెలుసుకున్న ఆదిత్య...దాని నుంచి దూరంగా జరిగేందుకు ప్రయత్నించినట్లు అందులో ఉంది. రబియా ఖాన్ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లో...'ఆదిత్య పంచోలి మున్ను, అంజు మహేంద్రులను డ్రాప్ చేయడానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన అక్కడే తిరుగుతూ కనిపించారు. ఆ తర్వాత ఆయన ఎవరికో ఫోన్ చేసారు. అతని ఫేసులో ఏదో అయోమయం కనిపించింది. ఆదిత్య జియా ఖాన్ ఇంట్లోకి వెళ్లలేదు. కొంత సేపటి తర్వాత మున్ను కిందకు వచ్చి జియా ఖాన్ మరణించిన విషయం వెల్లడించారు' అని పేర్కొనబడి ఉంది.

పిటీషన్లో పేర్కొనబడ్డ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...'సూరజ్ పంచోలి జియా ఖాన్ బాయ్ ఫ్రెండునే అని ఒప్పుకున్నాడు. మీడియాలో జియా ఖాన్ మరణవార్త స్ప్రెడ్ అయ్యే వరకు ఆయన జియా ఖాన్ నివాసానికి చేరుకోలేదు. జియా ఖాన్ పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆదిత్య పంచోలి జియా ఖాన్ నివాసానికి వచ్చాడు. అతని వెంటన వచ్చిన సూరజ్ వచ్చాడు' అని పేర్కొన బడింది.

స్లైడ్ షోలో సీసీ టీవీ ఫోటోలు...

జియాఖాన్ అపార్టుమెంటులో సిసిటీవీలో ఆదిత్య పంచోలి

జియాఖాన్ అపార్టుమెంటులో సిసిటీవీలో ఆదిత్య పంచోలి


ఆదిత్య పంచోలి సంగీత్ సాగర అపార్టుమెంటులో లాబీలో వేయిట్ చేస్తూ సీసీ టీవీకి చిక్కారు. కానీ అతను జియా ఖాన్ ఇంట్లోకి వెళ్లలేదు. రబియా ఖాన్‌ను పార్టీ నుంచి తీసుకువచ్చినప్పటికీ అతను ఇంట్లోకి వెళ్లలేదు.

అతపి ఫేసులో అయోమయం

అతపి ఫేసులో అయోమయం

జియా ఖాన్ అపార్టుమెంటుకు వచ్చిన సమయంలో ఆదిత్య పంచోలి ఫేసులో ఏదో అయోమయం కనిపించింది. ఆయన అలా ఎందుకు అలా ఉన్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.

సిబిఐ విచారణ కోరిన రబియా

సిబిఐ విచారణ కోరిన రబియా

జియా ఖాన్ కేసు విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని రబియా ఖాన్ కోరుతోంది.

పిటీషన్లో సిసిటీవీ పుటేజ్

పిటీషన్లో సిసిటీవీ పుటేజ్

డైలీభాస్కర్ సంస్థ దొరక పట్టిన సీసీటీవీ పుటేజీలను రబియా ఖాన్ తన పిటీషన్లో భాగంగా సమర్పించింది.

చావకు భయపడే వ్యక్తి కాదు

చావకు భయపడే వ్యక్తి కాదు

ఓ ప్రముఖ పత్రికకు రబియా ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....‘నా కూతురు చావుకు భయపడే వ్యక్తి కాదు. ప్రేమకు భయపడింది' అని వెల్లడించారు.

English summary
Rabiya Khan, mother of Jiah Khan has released CCTV images of Aditya Pancholi in her apartment the night Jiah died. Jiah used to reside in the Sagar Sangeet Apartment. The footage was obtained by Dailybhaskar and it shows a disturbed Rabiya Khan entering the building.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu