For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HIT 2 పోస్టర్‌పై జనసేన పార్టీ సింబల్.. పవన్, అకీరాపై అడివి శేష్ ఊహించని కామెంట్స్

  |

  టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు తమదైన టాలెంట్లతో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విలక్షణ నటనతో విశేషమైన గుర్తింపును అందుకున్నారు. అందులో టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ ఒకడు. విభిన్నమైన సినిమాలతో వస్తోన్న అతడు.. ఇప్పుడు 'హిట్: ది సెకెండ్ కేస్' అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అడివి శేష్ జనసేన పార్టీ సింబల్, పవన్ కల్యాణ్, అకీరాలపై కామెంట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే..

  సెకెండ్ కేస్ టేకప్ చేసిన హీరో

  సెకెండ్ కేస్ టేకప్ చేసిన హీరో

  ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చిన 'హిట్' మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. నేచురల్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది.

  మళ్లీ రెచ్చిపోయిన రీతూ చౌదరి: ఎద అందాలు కనిపించేలా హాట్ షో

  షూటింగ్ పూర్తి.. ప్రమోషన్స్‌తో

  షూటింగ్ పూర్తి.. ప్రమోషన్స్‌తో

  అడివి శేష్ హీరోగా రూపొందుతోన్న 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తైంది. ఆ వెంటనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి.. వాటిని కూడా ఇటీవలే కంప్లీట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కొన్ని అప్‌డేట్లను కూడా వదిలిపెట్టారు.

  ట్రైలర్ రిలీజ్.. భారీ రెస్పాన్స్

  ట్రైలర్ రిలీజ్.. భారీ రెస్పాన్స్

  క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ వీడియో ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫలితంగా దీనికి తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది.

  బ్రాతో యాంకర్ రష్మీ ఓవర్ డోస్ హాట్ షో: తొలిసారి ఇలా తెగించిన బ్యూటీ

  స్పెషల్ ఈవెంట్.. ఆసక్తికరంగా

  స్పెషల్ ఈవెంట్.. ఆసక్తికరంగా

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'హిట్: ది సెకెండ్ కేస్' ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత యూనిట్ సభ్యులు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో వాళ్లు అడిగిన ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు హీరో, డైరెక్టర్ సమాధానాలు ఇచ్చారు.

  పోస్టర్‌పై జనసేన పార్టీ సింబల్

  'హిట్: ది సెకెండ్ కేస్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఫిల్మీబీట్ ప్రతినిధి రాజాబాబు.. అడివి శేష్‌ను 'మీ సినిమా పోస్టర్ మీద జనసేన పార్టీకి చెందిన సింబల్ గాజు గ్లాసును పెట్టడం వెనుక ఏదైనా కారణం ఉందా' అని ప్రశ్నించారు. దీంతో అక్కడ నవ్వులు వెల్లివిరిశాయి. ఆ తర్వాత శేష్ 'ఆ ఉద్దేశంతో పెట్టలేదు.. అది జనసేన సింబల్ కాదు' అని క్లారిటీ ఇచ్చాడు.

  పవన్, అకీరాపై శేష్ కామెంట్స్

  పవన్, అకీరాపై శేష్ కామెంట్స్

  అనంతరం పవన్ కల్యాణ్, అకీరా నందన్ పేర్లను ప్రస్తావిస్తూ కొందరు కేకలు వేశారు. దీంతో అడివి శేష్ 'పవన్ కల్యాణ్ గారు కానీ, అకీరా కానీ నా హార్ట్స్. అయితే, ఆ పోస్టర్‌పై కావాలని మాత్రం ఆ సింబల్ పెట్టలేదు' అని చెప్పొకొచ్చాడు. దీంతో మరోసారి పవర్ స్టార్ ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని అడివి శేష్ ఇలా గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది.

  నాగశౌర్య కట్నం వివరాలు లీక్: అన్ని కోట్ల విలువైన కానుకలు.. అనూష పేరిట ఉన్న ఆస్తి ఎంతంటే!

  అకీరా ఫేవరెట్ హీరో అతడే

  అకీరా ఫేవరెట్ హీరో అతడే

  ఇదిలా ఉండగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్‌కు టాలీవుడ్‌లో అడివి శేష్ అంటేనే ఇష్టం అంటూ గతంలో చెప్పాడు. ఆ తర్వాత 'మేజర్' సినిమాను సైతం ఈ జూనియర్ పవర్ స్టార్ అతడితో కలిసే చూశాడు. అంతేకాదు, ఓ సందర్భంలో రేణూ దేశాయ్, ఆద్య, అకీరాలను కూడా అడివి శేష్ కలిశాడు. అలా వాళ్ల మధ్య మంచి బంధం ఏర్పడింది.

  English summary
  Young Hero Adivi Sesh Did HIT The Second Case Movie Under Sailesh Kolanu Direction. Now He Commented on Janasena Party and Pawan Kalyan At This Movie Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X