»   » విడుదలకు సిద్దమైన అడవి శేషు ‘కిస్’

విడుదలకు సిద్దమైన అడవి శేషు ‘కిస్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అడవి శేషు స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'కిస్'. 'కీపిట్ సింపుల్ స్టుపిడ్' ఇదే ఈ సినిమా ట్యాగ్ లైన్. మైడ్రీమ్స్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్, థౌజండ్ లైట్స్ సినిమా చిత్రం పతాకంపై అడవి సాయికిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా గురించి అడవి శేషు మాట్లాడుతూ...కిస్‌ అంటే కీపిట్‌ సింపుల్‌ స్టుపిడ్‌. సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. దొంగ వీసాతో అబ్రాడ్‌ వెళ్ళిన ఒక అబ్బాయికి ఇండో అమెరికన్‌ అయిన ఓ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమాయణమే ఈ చిత్రం అని తెలిపారు.

శీనుగా వెళ్ళి అక్కడ సన్నీగా పేరు మార్చుకుంటాడు హీరో. పోస్టర్స్‌ని గమనించినట్లయితే అతని ఆటిట్యూట్‌ ఏంటనేది తెలుస్తుంది. లైఫ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్‌ వచ్చినా.. తేలిగ్గా తీసుకుంటాడు. హీరో క్యారెక్టర్‌ చాలా ఇన్‌టెన్‌సిటీగా ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదని చెప్పుకొచ్చారు.

ఈ చిత్రంలో పియా బెనర్జీ హీరోయిన్. 'మిస్ కెనడా'గా మార్కులు కొట్టేసి, మోడలింగ్ రంగంలో దూకుడు మీదున్న ఈ అమ్మాయి, 'కిస్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి కెమెరా: షెనీల్‌దియో, సహనిర్మాత: ఆనంద్‌ బచ్చు, నిర్వహణ: భవానీ అడివి, దర్శకత్వం: అడివి శేషు.

English summary
Adivi Sesh and Priya Banerjee-starrer Kiss (Keep it simple stupid) is all set for release on September 13.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu