»   » 'బాహుబలి'లో 20 నిమిషాలు పాటు కనిపిస్తా!

'బాహుబలి'లో 20 నిమిషాలు పాటు కనిపిస్తా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''బాహుబలి మొదటి భాగంలో ఇరవై నిమిషాల పాటు తెరపై కనిపిస్తా. ఇంతకంటే ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు. ప్రస్తుతం నటుడిగా నా ప్రయాణం బాగుంది. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆ తరవాతే మళ్లీ మెగాఫోన్‌ పడతా..'' అంటున్నారు అడవి శేష్‌.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'బాహుబలి' లో అవకాసం వచ్చిన విధానం గురించి చెప్తూ...."నాకు బాహుబలి నిర్మాత శోభు గారు పరిచయం. ఆయన్ను నేను రాజమౌళి గారితో అపాయింట్మమెంట్ ఇప్పించమని రిక్వెస్ట్ చేసుకున్నాను. రాజమౌళి గారిని కలిసిన తర్వాత ఆయన్ని చిన్న పాత్ర అయినా ఆయన దర్శకత్వంలో చేసే అవకాసం ఇప్పించమని అడిగాను. నేను చివరకు ఆయన దర్శకత్వంలో జూనియర్ ఆర్టిస్టు రోల్ చెయ్యటానికి కూడా సిద్దంగా ఉన్నానని చెప్పాను. ఆయన అప్పుడు ఏమీ చెప్పలేదు. ఆయన మర్చిపోయారనుకున్నాను. అయితే తర్వాత కొద్ది నెలల తర్వాత ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది. సినిమాలో ఓ యువరాజు పాత్ర కీలకమైంది ఉందని చెప్పారు. అలా నేను బాహుబలిలో చేసాను " అన్నారు.


Adivi Sheshu get a small role in the epic Baahubali

'కర్మ', 'పంజా' 'రన్‌రాజారన్‌' చిత్రాలతో నటుడిగా ఆకట్టుకొన్న అడవి శేష్‌ దర్శకుడు కూడా. రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి'లో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మంచు లక్ష్మితో కలసి 'దొంగాట'లో నటించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అడవి శేష్‌ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ''మంచి సినిమాల్ని వదులుకోకూడదన్న స్వార్థం నాది. కథ కిక్‌ ఇస్తే చాలు. మరే విషయం ఆలోచించను''అంటున్నారు అడవి శేష్‌.


''క్రైమ్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన చిత్రమిది. డబ్బు కోసం ఓ స్టార్‌ హీరోయిన్ ని కిడ్నాప్‌ చేద్దామని ఎత్తులు వేసే పాత్ర నాది. హీరోయిన్ పాత్రలో మంచు లక్ష్మి నటంచింది. కథ వింటున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయా. నేను కూడా ఊహించని ఎన్నో ట్విస్టులు ఈ కథలో ఉన్నాయి. లక్ష్మి నేనూ స్నేహితులం. అందుకే సెట్లో చాలా సరదాగా గడిచిపోయింది''అన్నారు.


Adivi Sheshu get a small role in the epic Baahubali

తన పాత్ర గురించి చెప్తూ... దొంగాట సినిమాలో నాది లీడ్ రోల్. ఈ సినిమాలో వెంకట్ అనే పాత్రలో నటించా. డబ్బు కోసం ఎవరినైనా కిడ్నాప్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఓ హీరోయిన్‌ను కిడ్నాప్ చేసే వ్యక్తిగా ఇందులో కనిపిస్తా. ఇప్పటివరకూ నేను చేయనటువంటి పాత్రగా దీన్ని చెప్పుకోవాలి. మొదటిసారి కామెడీ సన్నివేశాల్లో నటించేందుకు అవకాశం దక్కింది. దర్శకుడు వంశీ ఈ పాత్ర కోసం వేరే ఇతర నటులను పరిశీలించినా, చివరకు ఈ ఆఫర్ నన్ను వరించడం నా అదృష్టం. నా కెరీర్లో ఈ సినిమా లాండ్‌ మార్క్‌గా నిలిచిపోతుంది అన్నారు.

English summary
The latest news is that Adivi Sesh will also appear in Rajamouli’s Epic drama film, Baahubali, in which he is playing a role of a prince.
Please Wait while comments are loading...