»   » యాంకర్ తో చిలిపిగా...బాలకృష్ణ సెల్ఫీ (ఫొటో)

యాంకర్ తో చిలిపిగా...బాలకృష్ణ సెల్ఫీ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ సినిమాల్లో ఎంత సీరియస్ గా ఉంటారో...బయిట అంత జోవియల్ గా ఉంటూంటారు. ఆయనలోని చిన్న పిల్లాడు బయిటకు వచ్చి అల్లరి చేస్తూంటాడు ఒక్కోసారి. తాజాగ ఆయన లయిన్ చిత్రం సక్సెస్ మీట్ లో ...అక్కడ యాంకర్ సెల్ఫీ అడిగింది. దానికి బాలయ్య ఇదిగో ఇలా ఫోజిచ్చి తన లోని చిలిపితనాన్ని చాటుకున్నారు. ఈ నాటి ఎక్సప్రెషన్ చూసినవారు షాక్ అవుతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఈ మధ్యే 'లయన్‌'గా సందడి చేసిన బాలయ్య....వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా 99వ సినిమా పనిలో పడిపోయారు. ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం బాలయ్యని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు శ్రీవాస్‌. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ ఖాన్‌ చిత్రాలకు పనిచేసిన మేకప్‌ నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ వార్త విన్న బాలకృష్ణ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. తమ అభిమాన హీరోని విభిన్నంగా చూడబోతున్నామనే ఆనందం వారిలో కనిపిస్తోంది.

కేవలం బాలయ్య లుక్‌ మాత్రమే కాదు కాస్ట్యూమ్స్‌ కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేయిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా తన పాత్ర విషయంలో వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొంటున్నారు. ఈ సినిమా కోసం బరువు తగ్గుతున్నారు. స్లిమ్‌గా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తులు మొదలెట్టేశారని తెలుస్తోంది.

Adorable selfie of Balayya with anchor Prasanthi

ఇక ఈ మధ్యన వరసగా వచ్చిన చిత్రాల్లో తన పాత్రలో ఆహార్యంలో మార్పు చూపిస్తూ వస్తున్నారు నందమూరి బాలకృష్ణ. పైగా దాదాపు ప్రతి చిత్రంలోనూ ఆయన పాత్రలో రెండు మూడు ఛాయలు కనిపిస్తుంటాయి. దానికి తగ్గట్టు లుక్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకొంటుంటూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ సారి మరింత కొత్త లుక్ తో అదరకొట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

'లౌక్యం'తో ఇంటిల్లిపాదినీ మెప్పించారు ఈ దర్శకుడు. ఇప్పుడు బాలయ్య శైలికి తగిన కథని సిద్ధం చేశారు. ఇంటిల్లిపాదినీ మెప్పించే కథతో వస్తున్నాం.. బాలయ్య అభిమానులకే కాదు, అన్ని వర్గాల వారికీ నచ్చే చిత్రమిది అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థతో కలసి శ్రీవాస్‌ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ కార్పొరేట్‌ సంస్థ, ఓ దర్శకుడితో కలసి నిర్మాణంలో భాగం పంచుకోవడం తెలుగులో ఇదే మొదటిసారి. ఈ నెల 29న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది.

ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ చిత్రానికి తమన్‌ స్వరాలు అందించడం ఇదే తొలిసారి. కోన వెంకట్‌, గోపీమోహన్‌ కథ అందించిన చిత్ర రచనలో ఎం.రత్నం, శ్రీధర్‌ సీపాన భాగం పంచుకొంటున్నారు.ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు.

English summary
At the success meet of “Lion” that took place yesterday, Balayya posed quite animatedly with anchor Prasanthi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu