»   »  రేటింగ్స్ అదిరిపోవాలనే...షకీలను తీసుకుంటున్నారు!

రేటింగ్స్ అదిరిపోవాలనే...షకీలను తీసుకుంటున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా అడల్ట్ స్టార్ షకీలా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. సౌతిండియా ప్రేక్షకులకు వెండితెరపై శృంగార రసంలో రుచి చూపించిన షకీలా గత కొంతకాలంగా అలాంటి సినిమాలకు దూరంగానే ఉంటోంది. సాధారణ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె బుల్లితెర ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

కన్నడలో ప్రసారం అవుతున్న రియాల్టీ షో 'బిగ్ బాస్'లో ఆమె కనిపించబోతోంది. హిందీలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ కాన్సెప్టును గతేడాది కన్నడలోనూ మొదలు పెట్టడంతో సక్సెస్ అయింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో జులై నెల నుండి రెండో సీజన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సారి షోకు మరింత పాపులారిటీ తెచ్చేందుకు పలువురు ప్రముఖులను, ముఖ్యంగా జనాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న సెలబ్రిటీలను ఎంపిక చేసి తీసుకుంటున్నారు. షకీలాకు ఉన్న పాపులారిటీ దృష్టి ఆమెను తీసుకుంటున్నారు. సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొన్న వివాదాస్పద స్వామీజీ నిత్యానందను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

షకీలా

షకీలా


శృంగార చిత్రాలను మానేసిన షకీలా ఇటీవల పలు తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంచేస్తోంది.

దర్శకత్వం వైపు

దర్శకత్వం వైపు


త్వరలో షకీలా దర్శకురాలిగా మారబోతోంది. ఓ మంచి ఫ్యామిలీ మూవీకి దర్శకత్వం వహిస్తానని చెబుతోంది.

షకీలా ఆత్మకథ

షకీలా ఆత్మకథ


షకీలా ఇటీవల తన ఆత్మకథను విడుదల చేసింది. తన జీవితంలోన జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను, చీకటి కోణాలను, షాకింగ్ విషయాలను బయట పెట్టింది.

ప్రస్తుతం తెలుగులో..

ప్రస్తుతం తెలుగులో..


ప్రస్తుతం షకీలా తెలుగులో ‘గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్' చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

English summary
South actress and adult movie star Shakeela is all set to make her small screen appearance. However the actress will not be making her small screen debut with any TV soaps, but she will be seen in Kannada's small screen famous TV reality show Bigg Boss Kannada 2. The second season of Bigg Boss Kannada is all set to go on floors in the last week of June or first week of July 2014. List Of Expected Contestants In Bigg Boss Kannada 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu