»   » మగధీరతో పోటీనా..అదుర్స్ కు అంత సీన్ లేదా..??

మగధీరతో పోటీనా..అదుర్స్ కు అంత సీన్ లేదా..??

Subscribe to Filmibeat Telugu

గత సంక్రాంతి సీజన్ లో విడుదలయిన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా 15 రోజుల్లోనే 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన చిత్రం అదుర్స్. ఎన్టీఆరో కథానాయకుడిగ నటించిన ఈ సినిమాలో చారి పాత్రలో ఆయన జీవిస్తే, బ్రహ్మానందం తన కామెడీతో అదరగొట్టాడు. దీనికి తోడు తెలంగాణా వివాదం దీనికి జతకావడంతో భారీ పబ్లిసిటీ లభించడంతో పాటు, యాక్సిడెంట్ అనంతరం ఎన్టీఆర్ మీద వున్న సింపథీ వర్కవుట్ అవడంతో ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించింది.

ఒకానొక సందర్భంలో ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మగధీర చిత్రం రికార్డుని బ్రేక్ చేస్తుందని కూడా పరిశీలకులు భావించారు. అయితే అదుర్స్ కు ఇప్పుడొస్తున్న కలెక్షన్లు చూస్తుంటే 100 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టిన మగధీరను బీట్ చేసే అవకాశాలు లేనట్టే అని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా, సూపర్ హిట్ చిత్రంగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu