»   » 'అదుర్స్‌' చిత్రంతో భయం పోయింది

'అదుర్స్‌' చిత్రంతో భయం పోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

పరుగు చిత్రం వరకు హోమ్లీ పాత్రల్లో కనిపించిన నన్ను గ్లామర్‌ పాత్రల్లో ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని భయపడ్డాను. అయితే ఈ సినిమాలో బాగా చేశావని, నీ శరీరాకృతి గ్లామర్‌ డ్రెస్‌లకు కూడా బాగుందని చాలామంది నాతో అన్నారు. దాంతో నా భయం మొత్తం పోయింది. వాస్తవానికి మా అమ్మ, నాన్న కూడా ఈ చిత్రంలో నువ్వు చాలా బాగున్నావని అభినందించారు అన్నారు అంటోంది షీలా. ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్ లోవచ్చి సంక్రాంతికి రిలీజైన అదుర్స్ చిత్రం విజయవంతంగా యాభై రోజులు దాటి ముందుకు వెళ్తోంది. దాంతో అందులో నటించిన షీలా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చింది.

అలాగే ఇక ఈ చిత్రం ఒప్పుకునే ముందు గ్లామర్ విషయంలో ఆలోచించానంటూ...ఇన్నాళ్ళూ హోమ్లీగా కంటిన్యూ అయిన నేను...ఇప్పుడు ట్రెండ్‌లో నెగ్గుకు రావడం కష్టం అనిపించింది. అందుకే గ్లామర్‌పై దృష్టి పెట్టాను. 'మస్కా'తో నాకా అవకాశం వచ్చింది. ఇక 'అదుర్స్‌'లో పూర్తి స్థాయి గ్లామర్‌ పాత్ర చేశాను. షీలా హోమ్లీ మాత్రమే కాదు..గ్లామర్‌ పాత్రలు కూడా చేయగలదని 'అదుర్స్‌' నిరూపించింది అందరూ అంటున్నారు. నాకు సంతోషంగా ఉంది. దాంతో నాకు 'అదుర్స్‌' భయం పోగొట్టినట్లయింది అని చెప్తోంది. ఇక అదుర్స్‌' తర్వాత తొమ్మిది సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని చెప్తోంది. కానీ అవన్నీ ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయిని, ఈసారి చేసే చిత్రాలు కూడా అదుర్స్ స్థాయిలోనే ఉండాలనుకుంటున్నాను. అందుకని ఆచి తూచి అడుగులేయాలనుకుంటున్నాను అంటూ ముగించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu