»   » ఈ సంక్రాంతికి అదరగొట్టిన ఎన్టీఆర్ 'అదుర్స్'..!!

ఈ సంక్రాంతికి అదరగొట్టిన ఎన్టీఆర్ 'అదుర్స్'..!!

Subscribe to Filmibeat Telugu

ప్రతీ ఏడాదీ తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేవి కోళ్లపందేలు, సంక్రాంతి సినిమాలు. ఈ సీజన్ లో వచ్చే సినిమాలకై ప్రేక్షకులు ఎంతో ఉత్సుకతో ఎదురుచూస్తారు. ఈ సీజన్ లో మరో విశేషం ఏంటంటే వచ్చిన సినిమాల్లో అధికభాగం ఒక సినిమా మాత్రమే విజయవంతం అవుతుంది. గత ఏడాది అరుంధతి సినిమా ఈ సంక్రాంతి సీజన్ లో టాప్ చైర్ లో నిలిచింది. మరి ఈ సంవత్సరం ఏ సినిమా ఈ సీజన్ లో టాప్ మూవీగా నిలుస్తుంది అని చాలా మంది ఆసక్తితో ఎదురుచూసారు. దీనికి కారణం ముగ్గురు అగ్ర కథానాయకులు ఈ సీజన్ లో పోటీ పడుతుండటం.

మరి ఇందులో ఏ సినిమా ఘనవిజయాన్ని సాధించింది అంటే మాత్రం ఏ సినిమా కూడా అదిరిపోయింది అనే రేంజిలో లేదని చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి విడుదలయిన సినిమాలను ఓ సారి చూస్తే ఎన్టీఆర్ 'అదుర్స్', వెంకటేశ్ 'నమో వెంకటేశ', రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజిలు 'శంభో శివ శంభో', నవదీప్, కాజల్ తదితరులు 'ఓం శాంతి' అంటూ మన ముందుకు వచ్చారు.

ఇందులో ఓం శాంతి సినిమా మల్టీస్టోరీస్ కథాశంతో విడుదలకు ముందు హంగామా చేసినా ఆ తర్వాత వీక్ స్క్రీన్ ప్లైతో చతికిలబడింది. ఇందులో నవదీప్ ఒక్కడే అంతోఇంతో ఆకట్టుకున్నాడు. మరి రవితేజ హీరోగా వచ్చిన సినిమా 'శంభో శివ శంభో' సినిమా మంచి మెసేజీతో వచ్చినా, కథలో తమిళ వాసనలు ఎక్కువగా వుంటడంతో మన ప్రేక్షకులకు అంతగా రుచించలేదు.

ఇక విక్టరీని ఇంటి పేరుగా మలచుకున్న వెంకటేశ్, కామెడీ సినిమాలు తీయడంలో తనకంటూ మంచి ఇమేజీని ఏర్పరచుకున్న శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా నమో వెంచటేశ. అదే పాతచింతకాయ పచ్చడి సినిమాను అదే పాత కామెడీ సీన్లను వేసి రీల్లను చుట్టేసి ప్రేక్షకుల మీదకు వదిలితే దాని ఫలితం ఎలా వుంటుందో ఈ సినిమాతో దర్శకుడికి ఈపాటికి అర్థమయిపోయింది. దీంతో శ్రీను వైట్ల పెద్ద హీరోలను సరిగా డీల్ చెయ్యలేడని అర్థమయిపోయింది. ఇంతకు ముందు శ్రీను వైట్ల చిరంజీవితో అందరివాడు, నాగార్జునతో కింగ్ సినిమాలు తీసినా అవి నిరాశపరచిన సంగతి తెలిసిందే.

ఇక కంత్రి సినిమా తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా అదుర్స్. వివి వినాయక్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా కథ కూడా పాతచింతకాయ పచ్చడి కథే అయినా, దర్శకుడి కూడా కథను పాత పంథాలోనే చెప్పినా చారిగా ఎన్టీఆర్ నటన, బట్టుగా బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకు హైలెట్. కథనం మొత్తం ఎంటర్టెయినింగ్ పద్దతిలో సాగటంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆశ్వాదిస్తున్నారు. ఇక నయనతార, షీలా అందాలు ఈ సినిమాకు అధనపు ఆకర్షణ.

ఇక ఇదే విషయమై మేము ఈ సంక్రాంతి రారాజు ఎవరు? అని మేము నిర్వహించిన పోల్ ఎన్టీఆర్ సినిమాయే అదుర్స్ అని 59% మంది ఓట్ చెయ్యగా, 26.5% శాతం మంది నమో వెంకటేశ సినిమా ది బెస్ట్ అని ఓట్ చేసారు. రవితేజ నటించిన శంభో శవ శంభో సినిమాకు 13.9% శాతం మంది ఓట్ చేసారు. ఇక ఓం శాంతి సినిమాను ఎవ్వరూ పట్టించుకున్నట్టు కూడా లేదు. కేవలం 0.6% మంది ఈ సినిమాను బెస్ట్ అని ఓట్ చేసారు. మొత్తానికి ఎన్టీఆర్, బ్రహ్మానందం నటన, నయన్, షీలాల గ్లామర్ ఈ సినిమాను సంక్రాంతి సింహాసనం మీద టాప్ ప్లేస్ లో నిలబడేట్టు చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu