twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ దర్శక, నిర్మాత ఆదుర్తి సుబ్బారావు పుస్తకావిష్కరణోత్సవం

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత ఆదతుర్తి సుబ్బారావుపై రూపొందించిన పుస్తకం సోమవారం నటుడు కృష్ణ నివాసంలో ఆశిష్కరించారు. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది. కృష్ణ, మహేష్ బాబు, నమ్రత, మంజుల, విజయనిర్మల తదితరులు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాలొన్నారు.

    ఈ పుస్తకారన్ని హెచ్.రమేష్ బాబు రాసారు. తొలి కాపీని కె. విశ్వనాథ్ ఆవిష్కరించి మహేస్ బాబుకు అందజేసారు. ఆదుర్తి గురించి 20 ఏళ్లుగా తన వద్ద ఉన్న సమాచారాన్నంతా ఈ పుస్తకంలో పొందు పరిచినట్లు తెలిపారు. ఆదుర్తి వల్లనే ఈ స్థాయికి ఎదిగానని కృష్ణగారు చెప్పారు, ఆయనే ప్రింటింగ్ ఖర్చులు భరించారు అని రమేష్ బాబు తెలిపారు.

    స్లైడ్ షోలో ఆదుర్తి సుబ్బారావుకు సంబంధించిన వివరాలు...

    ఆదుర్తి సుబ్బారావు పుస్తకావిష్కరణ-1

    ఆదుర్తి సుబ్బారావు పుస్తకావిష్కరణ-1

    ఆదుర్తి సుబ్బారావు 1912 సంవత్సరం డిసెంబరు 16 న రాజమండ్రి‌లో తాసీల్దారు సత్తెన్న ఇంట జన్మించారు. ముంబాయి‌లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్ మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించారు. ఆనాడు సంచలనం రేపిన ఉదయ శంకర్ 'కల్పన' చిత్రానికి అసోసియేట్ ఎడిటరుగా నియమితుడయ్యారు. అతని సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించారు.

    ఆదుర్తి సుబ్బారావు పుస్తకావిష్కరణ-2

    ఆదుర్తి సుబ్బారావు పుస్తకావిష్కరణ-2

    అనంతరం సినిమా రంగంలో ప్రవేశించిన ఆయన పూలరంగడు, గాజుల కిష్టయ్య మొదలైన 26 చిత్రాలు, 9 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆదుర్తి చిత్రాలు నిర్మాతలకు విశేష లాభాలు ఆర్జించి పెట్టినాయి. చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆదుర్తి సుబ్బారావు 1975 సంవత్సరంలో అక్టోబరు 29 న పరమపదించారు.

     ఆదుర్తి సుబ్బారావు పుస్తకావిష్కరణ-3

    ఆదుర్తి సుబ్బారావు పుస్తకావిష్కరణ-3

    ఆదుర్తి సుబ్బరావు దర్శకత్వంలో మహాకవి క్షేత్రయ్య, గాజుల కిష్టయ్య, గుణవంతుడు, సునెహరా సంసార్, బంగారు కలలు, జ్వర్ భట, ఇన్సాఫ్, మాయదారి మల్లిగాడు, జీత్, విచిత్రబంధం, రఖ్ వాలా, మస్తానా, దర్పన్, మరో ప్రపంచం, పూల రంగడు, డోలి, మన్ కా మీత్, మిలన్, సుడిగుండాలు, కన్నెమనసులు, సుమంగళి, తేనె మనసులు, తోడు నీడ, దాగుడు మూతలు, డాక్టర్ చక్రవర్తి, వెలుగు నీడలు, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, మంచి మనసులు, ఇద్దరు మిత్రులు, ఎంగళ్ కుల దైవి, నమ్మిన బంటు,ఆడపెత్తనం, మాంగళ్యబలం, తోడికోడళ్ళు, అమరసందేశం చిత్రాలు తెరకెక్కాయి.

    ఆదుర్తి సుబ్బారావు పుస్తకావిష్కరణ-4

    ఆదుర్తి సుబ్బారావు పుస్తకావిష్కరణ-4

    గాజుల కిష్టయ్య, మాయదారి మల్లిగాడు, జీత్(హిందీ), దర్పన్(హిందీ) చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాకుండా డోలి, మిలన్, సుడిగుండాలు, తేనె మనసులు, చదువుకున్న అమ్మాయిలు, మాంగల్యబలం, తోడికోడళ్ళు తదితర చిత్రాలకు రచయితగా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

    English summary
    Adurthi Subba Rao book lanched event held at the residence of Ghattamaneni today. Mahesh Babu, Krishna, K Viswanath attended. Adurthi was one of the greatest directors that the Telugu Film Industry had ever seen and he has even won 8 National Awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X