»   » ఆ వివాదాస్పద సెక్సీ సీన్లన్నీ ఐశ్వర్యా నే దర్శకుడితో వాదించి మరీ పెట్టించిందట

ఆ వివాదాస్పద సెక్సీ సీన్లన్నీ ఐశ్వర్యా నే దర్శకుడితో వాదించి మరీ పెట్టించిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వ‌ర్య రాయ్, అనుష్క శ‌ర్మ, ర‌ణ‌బీర్ న‌టిస్తున్న ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ యే దిల్ హై ముష్కిల్ . క‌ర‌న్ జోహార్ డైర‌క్ట్ చేస్తున్న ఈ సినిమాలో పాకిస్థాన్ సూప‌ర్ స్టార్ ఫ‌హ‌ద్ ఖాన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ట్ర‌యాంగిల్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రేమికుల భావోద్వేగాలు ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసేలా ఉన్నాయని టాక్. లండ‌న్‌లో కొన్ని నెల‌ల పాటు ఈ మూవీని చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన పోస్ట‌ర్స్‌లోనూ, టీజ‌ర్‌లోనూ ల‌వ్ బ్రేక్‌ను హార్ట్ ట‌చ్చింగ్‌గా డైరెక్ట‌ర్ ప్ర‌జెంట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా యే దిల్ హై ముష్కిల్ ఫుల్ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటలలోనే 9 లక్షలకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది

నలభై ఏళ్ల వయసులో కూడా ఘాటైన శృంగార దృశ్యాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌. అసలు ఆ సీన్లు చూసిబ్న వాళ్ళు షాక్ తిన్నారు. ఐష్ లో ఏమాత్రం వయసు చాయలు కనిపించలెదు పెద్దింటి కోడలు, పైగా ఓ బిడ్డకు తల్లైన ఐష్‌ 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రంలో రణ్‌బీర్‌తో పండించిన కెమిస్ట్రీ ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ పాత్ర కోసం ఐష్‌ను అనుకున్నప్పుడు ఇలాంటి ఘాటైన ఇంటిమేట్‌ సీన్లు లేవట.

Ae Dil Hai Mushkil behind the scenes

ఈ చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌కు కూడా అలాంటి ఆలోచన లేదట. అయితే ఈ రోల్‌ గురించిన స్ర్కిప్టు చదివినపుడు ఐష్‌ ఏదో వెలితిగా ఫీలైందట. ఈ పాత్ర స్వభావాన్ని దర్శకుడు చంపేస్తున్నట్టు భావించిందట. అందుకే ఈ పాత్రను వీలైనంత బోల్డ్‌గా మార్చాలని దర్శక, నిర్మాతలకు సూచించిందట. ఐష్‌ నుంచి అలాంటి సూచనలు వచ్చిన తర్వాతే చిత్ర యూనిట్‌ సాధ్యమైనన్ని శృంగార సన్నివేశాలు ఇరికించిందట. నిజం చెప్పాలంటే ఆ సన్నివేశాల్లో ఐష్‌ నటించిన తీరు చూసినవారెవరికీ ఆమె వయసు 40 సంవత్సరాలని, ఓ బిడ్డకు తల్లిని అనిపించదు. అంతలా మాయ చేసింది ఈ నీలి కళ్ల సుందరి. ఆమె నటించిన తీరు చూస్తుంటే తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను ఐష్‌ చాలా సీరియస్‌గా తీసుకున్నట్టుంది.

English summary
Bollywood reports says that "When Ash was approached for the role the makers had kept a mild script, but on reading her part she felt that it was incomplete. Aishwarya felt that by making her character tame the makers were killing it."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu