»   »  చాలా రోజుల తర్వాత ఐశ్వర్యరాయ్‌ రొమాంటిక్‌‍గా... (‘యే దిల్ హై ముష్కిల్’ టీజర్ సూపర్బ్)

చాలా రోజుల తర్వాత ఐశ్వర్యరాయ్‌ రొమాంటిక్‌‍గా... (‘యే దిల్ హై ముష్కిల్’ టీజర్ సూపర్బ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఐశ్వర్యరాయ్ ని తెరపై రొమాంటిక్ గా చూసి ఎన్ని సంవత్సరాలైందో? ఆరాధ్య పుట్టిన తర్వాత ఐశ్వర్యరాయ్ దాదాపు ఐదేళ్ల పాటు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. 2015లో మళ్లీ ఆమె సినిమాలు చేయడం ప్రారంభించింది. జజ్బా, సరబ్జీత్ చిత్రాల్లో నటించింది. అయితే ఈ రెండు చిత్రాల్లో రొమాన్స్‌కు అసలు అవకాశమే లేదు.

ఐశ్వర్యని తమ కలల రాణిగా ఊహించుకునే అభిమానులకు ఆ రెండు సినిమాలు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఐశ్వర్యరాయ్ అభిమానులకు నచ్చే విధంగా కనిపించబోతోంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ తనకంటే పదేళ్లు చిన్నవాడైన రణబీర్ కపూర్ తో రొమాన్స్ చేస్తోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా టీజర్లో చూపించిన రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయంటున్నారంతా.

ఐశ్వర్యారయ్ ఇందులో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఆమెతో పాటు అనుష్క శర్మ కూడా నటిస్తున్నప్పటికీ ఆమెను డామినేట్ చేసే విధంగా ఐశ్వర్యరాయ్ అందం ఉండటం గమనార్హం. పాకిస్థాన్ నటుడు ఫవాద్ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నాడు.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన విశేషాలు, ఫోటోస్, టీజర్

యే దిల్ హై ముష్కిల్

యే దిల్ హై ముష్కిల్


యే దిల్ హై ముష్కిల్ మూవీ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది.

కరణ్ జోహార్

కరణ్ జోహార్


ఈ చిత్రానికి కథ, దర్శకత్వం ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

ప్రధాన పాత్రలు

ప్రధాన పాత్రలు


ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా దీప్తి నావల్, లీసా హెడెన్, ఫవాద్ ఖాన్, ఇమ్రాన్ అబ్బాస్, షారుక్ ఖాన్ గెస్ట్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.

రిలీజ్

రిలీజ్


ఈ చిత్రాన్ని అక్టోబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఐష్-రణబీర్

ఐష్-రణబీర్


ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ సినిమాలో హైలెట్ కానున్నాయి.

కథేంటి?

కథేంటి?


అయితే ఈ సినిమా కథేంటి? ట్రయాంగిల్ లవ్ స్టోరీనా? లేక విభిన్నంగా సాగే మెచ్యూర్డ్ ప్రేమకథాంశమా? అనేది తెలియాల్సి ఉంది.

అనుష్క

అనుష్క


అనుష్క ఈ చిత్రంలో గత సినిమాల కంటే విభిన్నమైన లుక్ తో, సూపర్ హాట్ గా కనిపించబోతోంది.

విదేశాల్లోనే..

విదేశాల్లోనే..


సినిమా టీజర్ చూస్తుంటే కథ మొత్తం ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని స్పష్టమవుతోంది.

రణబీర్, అనుష్క

రణబీర్, అనుష్క


సినిమాలో రణబీర్ కపూర్, అనుష్క శర్మ జర్నీ ఆసక్తికరంగా సాగుతుందని అంటున్నారు.

కరణ్ జోహార్

కరణ్ జోహార్


కుచ్ కుచ్ హోతాహై, కబి ఖుషి కబి గమ్, కబీ అల్విదా న కహెనా, మైనేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లాంటి హిట్ చిత్రాల తర్వాత కరణ్ జోహార్ నుండి వస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టెనర్ ఇది.

ఫస్ట్ లుక్

ఫస్ట్ లుక్


ఇంతకాలం సైలెంటుగా ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైన తర్వాత ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది.

rnrn

టీజర్


యే దిల్ హై ముష్కిల్ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇదే

English summary
Oh my god! This would be your first reaction after watching the teaser of Karan Johar's upcoming film, Ae Dil Hai Mushkil! The teaser starts with the introduction scene of Ranbir Kapoor, who is crooning the title track of the film (i.e., Ae Dil Hai Mushkil) and the song is just too good that it will make you go crazy.In the next scene, he will be seen doing crazy stuffs with Anushka while, with Aishwarya Rai Bachchan, he is seen indulging in highly passionate moments! And we gotta say that, when you compare the leading ladies, it's Aishwarya Rai Bachchan, who has an upper hand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu