»   » బాహుబలి తర్వాత ప్రభాస్ కనిపించరే.. 1000 కోట్ల హీరో ఎక్కడ.. ఏంచేస్తున్నాడో తెలుసా..

బాహుబలి తర్వాత ప్రభాస్ కనిపించరే.. 1000 కోట్ల హీరో ఎక్కడ.. ఏంచేస్తున్నాడో తెలుసా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రం ఓ వైపు జైత్రయాత్రను కొనసాగిస్తుంటే ప్రభాస్ ఎక్కడ మీడియాలో కనిపించడే. మీడియా పబ్లిసిటీకి దూరంగా ఎందుకు ఉంటున్నాడు.. ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న ప్రశ్న. బాహుబలి2 రిలీజ్ తర్వాత లండన్ బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక ప్రదర్శనకు దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభూ, సంగీత దర్శకుడు కీరవాణి తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ స్పెషల్ షోకు ప్రభాస్ మాత్రం దూరంగా ఉండటం గమనార్హం. అయితే ఆ షోకు హాజరుకాకపోవడానికి కారణం ప్రభాస్ అమెరికాలో ఉండటమే అని తెలిసింది.

అమెరికాలో విహారయాత్ర..

అమెరికాలో విహారయాత్ర..

బాహుబలికి ఐదేళ్లు అంకితమైన తర్వాత సేద తీరేందుకు ప్రభాస్ అమెరికా వెళ్లారు. ప్రస్తుతం అమెరికాలో విహార యాత్ర చేస్తున్నారు. ఆ తర్వాత సుజిత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే సాహో చిత్ర షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటారనేది సమాచారం.

సాహో చిత్ర షూటింగ్..

సాహో చిత్ర షూటింగ్..

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించనున్న సాహో చిత్ర టీజర్ ఇటీవల విడులైంది. యూట్యూబ్‌లో ఈ టీజర్‌కు విశేష ఆదరణ లభించింది. దాదాపు 70 లక్షల మందికి పైగా వీక్షించడం గమనార్హం. బాహుబలి2 సినిమా రిలీజ్‌తో థియేటర్లలో ఈ సినిమా టీజర్‌ను ప్రదర్శిస్తున్నారు.

150 కోట్లతో సాహో..

150 కోట్లతో సాహో..

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రాన్ని దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాషల్లో రూపొందుతున్నది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీతత్రయం శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతాన్ని అందించడం విశేషం.

వెయికోట్ల హీరో ఎక్కడ..

వెయికోట్ల హీరో ఎక్కడ..

భారతీయ సినిమా పరిశ్రమలో వెయికోట్లు సాధించిన చిత్రం హీరోగా ప్రభాస్ చరిత్రకు ఎక్కనున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్‌లో కూడా ఏ హీరో ఈ ఘనతను సాధించలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రభాస్ నేషనల్ ఐకాన్ అని జాతీయ మీడియా కీర్తిస్తున్నాయి.

English summary
Prabhas became a global star after the stupendous success of Baahubali: The Beginning. The Mirchi actor spent more than four years of his career to make something like Baahubali possible. According Reports Prabhas is currently holidaying in the US, where he will be resuming the shoot of his upcoming trilingual action drama Saaho, which is directed by Sujeeth Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu