»   »  ఐశ్వర్యరాయ్ నెక్ట్స్ మూవీ: పాకిస్థాన్ జైల్లో హత్యోదంతం

ఐశ్వర్యరాయ్ నెక్ట్స్ మూవీ: పాకిస్థాన్ జైల్లో హత్యోదంతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఐశ్వర్యరాయ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘జాజ్బా' చిత్రం ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా.

దీని తర్వాత ఆమె ఓ రియల్ లైఫ్ కథాంశంతో తెరకెక్కే చిత్రంలో నటించబోతోంది. పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇందులో సరబ్జీత్‌సింగ్ సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించబోతుందని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం తొలుత ప్రియాంకచోప్రా, కంగనారనౌత్, దీపికాపదుకునే పేర్లను పరిశీలించారు. అయితే దల్బీర్‌కౌర్‌లాంటి ధీర వనిత పాత్రకు ఐశ్వర్యరాయ్ మాత్రమే న్యాయం చేయగలదని భావించి ఆమెను ఎంపికచేశామని దర్శకుడు చెప్పారు.

After Jazbaa, Aishwarya Rai To Play Sarabjit Singh's Sister!

1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రశేశించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్‌సైన్యం జైల్లో నిర్భందించింది. లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు రెండేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు. సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి సరబ్జీత్ సింగ్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

English summary
Aishwarya Rai Bachchan is all set to hit the screen with her comeback film Jazbaa but the actress has reportedly grabbed another powerful role in the upcoming Sarabjit Singh biopic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu