బ్రేకింగ్.. రజనీకాంత్ పొలిటికల్ పంచ్.. పా రంజిత్‌తో మూడోసారి.. శంకర్‌తో ముదావలన్2

By Rajababu

Recommended Video

బ్రేకింగ్.. రజనీకాంత్ పొలిటికల్ పంచ్.. సినిమాలకు గుడ్‌బై !

సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై దృష్టిపెడుతూనే మరోవైపు సినిమాల వేగాన్ని కూడా పెంచినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే రెండు చిత్రాలతో బిజీగా ఉన్న రజనీ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అయితే ఆ చిత్రానికి దర్శకుడు పా రంజిత్ కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 కబాలి, కాలా.. పా రంజిత్

కబాలి, కాలా.. పా రంజిత్

రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషన్‌లో కబాలి చిత్రం వచ్చింది. ఆ చిత్రానికి వచ్చిన హైప్‌ కంటే సినిమా తక్కువగా ఆడటంతో ఫ్యాన్స్ కొంత నిరాశపడ్డారు. ఆ తర్వాత వెంటనే పా రంజిత్‌ దర్శకత్వంలో కాలా చిత్రంలో నటించేందుకు ముందుకొచ్చారు. కాలా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

 పా రంజిత్‌తో రజనీ మూడో చిత్రం

పా రంజిత్‌తో రజనీ మూడో చిత్రం

కాలా సినిమా రిలీజ్ కాకముందే పా రంజిత్‌ డైరెక్షన్‌లో మరో చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ వార్త తమిళ సినీ వర్గాల్లో సెన్సేషన్‌గా మారింది.

 రాజకీయ నేపథ్యంగా రజనీ సినిమా

రాజకీయ నేపథ్యంగా రజనీ సినిమా

రజనీకాంత్, పా రంజిత్ కాంబినేషన్‌లో వచ్చే మూడో చిత్రం రాజకీయ నేపథ్యంగా రూపొందనున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం ద్వారా తాను స్థాపించబోయే రాజకీయపార్టీకి పునాది వేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది.

 సినిమాలకు రజనీకాంత్ గుడ్‌బై

సినిమాలకు రజనీకాంత్ గుడ్‌బై

పా రంజిత్ దర్శకత్వంలో వచ్చే మూడో చిత్రం తర్వాత రజనీకాంత్ సినిమాలకు గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. సినిమాల నుంచి తప్పుకొని రాజకీయాల్లో బిజీగా మారడానికి ప్రణాళికను రచిస్తున్నట్టు సమాచారం.

ఏప్రిల్‌లో రోబో2 రిలీజ్

ఏప్రిల్‌లో రోబో2 రిలీజ్

ఇదిలా ఉండగా, మరో వార్త తమిళ సినీవర్గాల్లో వైరల్‌గా మారింది. రోబో2 తర్వాత రజనీకాంత్, శంకర్ జతకడుతున్నారు. వారిద్దరూ ముదావలన్2 చిత్రానికి తెర లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆ వార్త సారాంశం. అయితే పా రంజిత్ లేదా శంకర్ చిత్రాల్లో ఏది పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం రజనీ నటించిన రోబో2 చిత్రం ఏప్రిల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X