»   » కాజల్ పాత జ్ఞాపకాలు.. అందుకేనా హీరో రామ్‌తో!

కాజల్ పాత జ్ఞాపకాలు.. అందుకేనా హీరో రామ్‌తో!

Subscribe to Filmibeat Telugu

చందమామ కాజల్ తన పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నట్లు ఉంది. అందుకేనేమో కెరీర్ ఆరంభంలో నటించిన హీరోలతో ఇప్పుడు మళ్ళీ వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. అప్పుడెప్పుడో కాజల్ అగర్వాల్ కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మి కళ్యాణం చిత్రంలో నటించింది. దాదాపు పదేళ్ల తరువాత తిరిగి ఎమ్మెల్యే చిత్రంలో కళ్యాణ్ రామ్ తో రొమాన్స్ పండించింది. ఎమ్మెల్యే చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

హీరో రామ్ తో కూడా కాజల్ నటించి తొమ్మిదేళ్లు గడుస్తోంది. ఎట్టకేలకు తిరిగి రామ్ తో సినిమా చేసేందుకు కాజల్ రెడీ అవుతోంది. గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శత్వంలో నటించేందుకు రామ్ సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రానికి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాజల్, రామ్ కలసి నటించిన గణేష్ చిత్రం విజయం సాధించలేదు. దీనితో ఈ జంట మళ్లీ కలసి నటించలేదు. చాలాకాలం తరువాత కాజల్ తన పాత హీరోలతో జత కట్టబోతుండడంతో ఆసక్తి నెలకొని వుంది.

After long time Kajal Aggarwal will going to romance with Ram
English summary
After long time Kajal Aggarwal will going to romance with Ram. Praveen Sattaru is directing this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X