»   » నితిన్ మరణంపై తప్పుడు రాతలొద్దు.. మోహన్‌బాబు ఆగ్రహం..

నితిన్ మరణంపై తప్పుడు రాతలొద్దు.. మోహన్‌బాబు ఆగ్రహం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత, సీనియర్ నటి జయసుధ భర్త నితిన్ ద్వారకదాస్ కపూర్‌పై మరణంపై కొన్ని మీడియా నెట్‌వర్క్స్ తప్పుడు రాతలు రాస్తున్నాయని ప్రముఖ నటుడు మోహన్‌బాబు మండిపడ్డారు. నితిన్ ఆకస్మిక మరణంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నితిన్ కపూర్ మరణంపై మోహన్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. సోదరి నివాసంలో ఉంటున్న నితిన్ కపూర్ మంగళవారం ముంబైలోని ఆరంతస్థుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే.

జయసుధ షాక్‌లో ఉన్నారు..

జయసుధ షాక్‌లో ఉన్నారు..

‘నా సోదరి జయసుధతో మాట్లాడాను. బాధలో ఉన్న ఆమెను ఓదార్చాను. జయసుధ ఒకరకమైన షాక్‌లో ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. భర్తను పోగొట్టుకొని బాధలో ఉన్న ఆమెకు కొంత ప్రైవసీ ఇవ్వండి' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

షాక్‌లో ఉన్నార.. ప్రైవసీ ఇవ్వండి

షాక్‌లో ఉన్నార.. ప్రైవసీ ఇవ్వండి

‘దయచేసి జయసుధ కుటుంబానికి ఇబ్బందిపెట్టేలా వ్యవహరించకండి. వారికి ప్రైవసీకి భంగం కలిగించవద్దు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వండి. డియర్ నితిన్. నా స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలి' మరో ట్వీట్ చేశారు.

 సోదరి ఫ్లాట్‌పై నుంచి దూకి

సోదరి ఫ్లాట్‌పై నుంచి దూకి

కొంతకాలంగా డిప్రెషన్ గురైన నితిన్ కపూర్ ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ముంబైలోని ఆంధేరీలోని జేపీ రోడ్‌లోని సోదరి ఫ్లాట్‌లో కొంతకాలంగా ఉంటున్నారు.

గతంలోనూ ఆత్మహత్యా ప్రయత్నం

గతంలోనూ ఆత్మహత్యా ప్రయత్నం

జయసుధ భర్త, సినీ నిర్మాత నితిన్ కపూర్ మరణం వెనుక దిగ్బ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ కూడా నితిన్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. 18 ఏళ్లుగా సరైన విజయాలు లేకపోవడం ఆయన కుంగదీసినట్టు తెలుస్తున్నది.

 వెర్సోవా పోలీసుల కేసు నమోదు

వెర్సోవా పోలీసుల కేసు నమోదు

నితిన్ మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో యాక్సిడెంటల్ మరణంగా కేసు నమోదైంది.

English summary
Actor Mohan Babu has come out in support of Jayasudha. He has requested the media to give her some privacy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu