twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌తో చేదు అనుభవం.. అయినా మరో బయోపిక్‌తో నిర్మాత సాహసం!

    |

    టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొన్ని ఎన్టీఆర్ బయోపిక్ ఇతర బయోపిక్ ఆశలపై నీళ్లు జల్లింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పేలవమైన వసూళ్లను రాబడుతున్నది. మహానటి, డర్టీ పిక్చర్ లాంటి సినిమాలతో బయోపిక్స్ అంటే సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ భావించారు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ ఎదురైన పరిస్థితులు బయోపిక్ నిర్మాణాలపై నిర్మాతలను మరోసారి ఆలోచింపజేస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ దారుణమైన వైఫల్యాన్ని మరిచిపోకముందే మరో పవర్‌ఫుల్ బయోపిక్‌కు శ్రీకారం చుట్టారు నిర్మాత విష్ణూ ఇందూరి. ఎన్టీఆర్ బయోపిక్‌తో క్రేజీ నిర్మాతల్లో ఒకరిగా మారిన విష్ణు.. ఇప్పుడు మరో సాహసాన్ని భుజాన కెత్తుకున్నారు. అదేమిటంటే..

    ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే ఆలోచనకు

    ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే ఆలోచనకు

    ఎన్టీఆర్ బయోపిక్‌ నిర్మాణానికి ఆద్యుడు విష్ణు ఇందూరి. నందమూరి తారక రామారావు జీవితాన్ని తెరకెక్కించాలనే కోరికతో స్క్రిప్టును, ఆలోచనను బాలకృష్ణ ముందు పెట్టారు. విష్ణు ఆలోచనకు సానుకూలంగా స్పందించడంతో దర్శకుడిగా రాంగోపాల్ వర్మ, ఆ తర్వాత తేజ పేర్లు వెలుగులోకి వచ్చాయి. నిర్మాతగా విష్ణు అనుకుంటే.. బాలకృష్ణ, సాయి కొర్రపాటి పేర్లు తెరపైకి వచ్చాయి. అలా ఎన్టీఆర్ బయోపిక్‌కు బీజం పడింది.

    షాకిచ్చిన కథానాయకుడు

    షాకిచ్చిన కథానాయకుడు

    ఎన్టీఆర్ బయోపిక్‌లో పార్ట్ 1 కథానాయకుడు రిలీజ్ తర్వాత దారుణమైన షాక్ తగిలింది. ప్రజలంతా బ్రహ్మరథం పడుతారనుకొంటే ఆడియెన్స్ థియేటర్‌కు వెళ్లకుండా ముఖం చాటేశారు. దాంతో డిస్టిబ్యూటర్లు నష్టాల్లో కూరుకుపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది.

    మహానాయకుడు పరిస్థితి కూడా దారుణంగానే

    మహానాయకుడు పరిస్థితి కూడా దారుణంగానే

    ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2తో డిస్టిబ్యూటర్లను ఆదుకొందామనుకొంటే వసూళ్లు మరింత షాక్ కలిగించాయి. ఓవరాల్‌గా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. కానీ ఓ మంచి సినిమాను తెరకెక్కించిన సంతృప్తి మిగిలిందని నిర్మాత విష్ణు ఇందూరి తన సన్నిహితులతో అభిప్రాయాన్ని పంచుకొన్నారట. భవిష్యత్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రాముఖ్యత ఏంతో ఖచ్చితంగా తెలుస్తుందని వ్యాఖ్యానించారట.

    జయలలిత బయోపిక్‌పై ఫోకస్

    ఇక ఎన్టీఆర్ బయోపిక్‌ పనులు ఓ వైపు కొనసాగిస్తూనే మరోవైపు జయలలిత బయోపిక్ కథా చర్చలు, స్క్రిప్టు పనులు, పరిశోధన విస్తృతంగా జరిపించారు విష్ణు ఇందూరి. ఎన్టీఆర్ బయోపిక్ అందించిన ఫలితాన్ని పట్టించుకోకుండానే, ఫిబ్రవరి 24న జయలలిత బయోపిక్‌ టైటిల్‌ తలైవి అని ప్రకటించారు. ఈ సినిమాను టైటిల్‌ను జయలలిత జన్మదినం రోజున ప్రకటించడం విశేషంగా మారింది.

    సాంకేతికవర్గం ఇదే

    తలైవి చిత్రానికి విష్ణు ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తారు. బాహుబలి, మణికర్ణిక చిత్రాలకు కథా సహాకారం అందించిన విజయేంద్ర ప్రసాద్ తలైవి చిత్ర కథపై కసరత్తు చేస్తున్నారు. స్టోరి టీమ్‌కు ఆయన హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం, నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా, మదన్ కార్వి పాటల రచయితగా పనిచేస్తున్నారు అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

    సీసీఎల్‌తో విష్ణు ఇందూరి

    సీసీఎల్‌తో విష్ణు ఇందూరి

    ఇక విష్ణు ఇందూరి విషయానికి వస్తే, గతంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్‌) వ్యవస్థాపకుడిగా, ఎండీగా వ్యవహరించారు. సీసీఎల్‌తో ఆశించిన ప్రయోజనం దక్కలేదనట్టు మీడియా కథనాలు వచ్చాయి. అలా మీడియాకు పరిచయమైన విష్ణువర్ధన్ ఇందూరి ఎన్టీఆర్ బయోపిక్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

    English summary
    After NTR Biopic, Producer Vishnu Induri focus shifteed to Jayalalithaa Biopic. February 24, marks her 71st birthday and on this auspicious day, filmmaker AL Vijay has announced Jayalalithaa's biopic has been titled Thalaivi. The director, in a statement, stated that the cast and crew will be announced shortly. Reportedly, the research work is on since nine months. Ace writer Vijayendra Prasad has been brought on board as the team's mentor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X