»   » ఆ నటి మానసిక స్థితి దారుణం. అయినా షూటింగ్‌కు.. కాబోయే భర్త..

ఆ నటి మానసిక స్థితి దారుణం. అయినా షూటింగ్‌కు.. కాబోయే భర్త..

Posted By:
Subscribe to Filmibeat Telugu

లైంగిక వేధింపులకు గురైన మలయాళ నటి మానసిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందట. దాంతో ప్రస్తుతం ఆమె మానసిక శిక్షణ (కౌన్సెలింగ్) తీసుకొంటున్నట్టు సమాచారం. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న మలయాళ నటికి ఆమె కాబోయే భర్త బాసటగా నిలిచి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. మహాత్మ చిత్రంలో శ్రీకాంత్ సరసన నటించిన హీరోయిన్‌పై ఇటీవల కేరళలో లైంగిక వేధింపులకు గురైన సంగతి తెలిసిందే.

కౌన్సిలింగ్‌లో మలయాళ నటి

కౌన్సిలింగ్‌లో మలయాళ నటి

‘కారులో లైంగిక వేధింపులకు గురైనప్పటి నుంచి ఆమె కౌన్సెలింగ్‌ తీసుకొంటున్నది. షూటింగ్‌లకు కూడా హాజరవుతున్నది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఆమెకు సరిగా నిద్ర పట్టడం లేదు. ఒకరకమైన భయాందోళనకు లోనైంది' అని మలయాళ నటి స్నేహితురాలు మీడియాకు వెల్లడించింది.

త్వరలోనే పీడకల నుంచి నార్మల్ లైఫ్‌లోకి

త్వరలోనే పీడకల నుంచి నార్మల్ లైఫ్‌లోకి

తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారి అరెస్ట్ జరుగడంతో మలయాళ నటికి కొంత ఊరట కలిగింది. త్వరలోనే ఆమె సాధారణ జీవితంలో ప్రవేశిస్తుంది' అనే ఆశాభావాన్ని ఆమె స్నేహితురాలు వ్యక్తం చేసింది.

మలయాళ నటికి కాబోయే భర్త బాసట.

మలయాళ నటికి కాబోయే భర్త బాసట.

జీవితంలో దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న మలయాళ నటికి ఆమె కాబోయే భర్త, సినీ నిర్మాత బాసటగా నిలిచారు. ఇలాంటి విషయాలను బయటపడాలంటే షూటింగ్‌కు వెళ్లాలని పట్టుబట్టారు. సోమవారం కొన్ని సీన్లను షూట్ చేశారు. ఆమె వెంట కాబోయే భర్త ఉంటున్నాడు. ఆమెకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నాడు. సెట్లో ఇతరుల నుంచి ఎలాంటి అసౌకర్యమైన ప్రశ్నలు రాకుండా జాగ్రత్త తీసుకొంటున్నాడు అని సినీ వర్గాలు వెల్లడించాయి.

మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్.. నో కమ్యూనికేషన్

మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్.. నో కమ్యూనికేషన్

ఘటన జరిగినప్పటి నుంచి గత కొద్దికాలంగా మలయాళ నటి ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఆమె తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకొన్నారు. పీడ కల నుంచి విముక్తి పొందేందుకు ప్రస్తుతం ఆమె ఏకాంత జీవితం గడుపుతున్నారు అని సన్నిహితులు తెలిపారు.

English summary
Malayalam actress has been in counselling ever since the incident happened. She has resumed shooting. Her fiancée, who is a producer, has stood by her through all this. Says the sources..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu