»   » ఇంత దారుణంగానా? : బాలయ్యని అడ్డం పెట్టి చిరంజీవి పై వర్మ ఓ రేంజిలో సెటైర్స్, వెటకారాలు

ఇంత దారుణంగానా? : బాలయ్యని అడ్డం పెట్టి చిరంజీవి పై వర్మ ఓ రేంజిలో సెటైర్స్, వెటకారాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమాలతో కన్నా ట్వీట్స్ తోనే సంచలనం సృష్టించే పనిలో ఉన్న దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయనకు, మెగా హీరోలకు ఎక్కడ చెడిందో గాని.. వారి మీద సెటైర్లు వేసేందుకు వచ్చే ఏ అవకాశాన్నీ ఆయన వదులుకోవడం లేదు.

చాలాసార్లు మెగా హీరోలకు సంబంధం లేని విషయంలో కూడా వారిని లాగి విమర్శిస్తూ వస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను అద్భుతంగా పొగిడేసిన వర్మ.. ఆ సందర్భంగా మెగాస్టార్‌ను టార్గెట్‌ చేస్తూ వరుస ట్వీట్లు చేసి, హాట్ టాపిక్ గా మారారు.

ఏ చిన్నపాటి అవకాశం లభించినా మెగా కాంపౌండ్‌పై విమర్శలు గుప్పించే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇపుడు ఆయనకు మరో అవకాశం లభించిందని మీడియా వర్గాలు అంటున్నాయి. శుక్రవారం విడుదలైన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్‌ను మెగా కాంపౌండ్‌కు షాక్ ఇచ్చే అస్త్రంగా మలుచుకున్నారు. బాలయ్య 'శాతకర్ణి' ట్రైలర్ చూసి ఫిదా అయిపోయినట్టు వర్మ ట్వీట్ చేశాడు.

అంతేకాదు వర్మ మరో అడుగు ముందుకు వేసి అభిమానులు నిజంగా మెగాస్టార్ అభిమానులు అయితే తమ మెగాస్టార్‌ను 'బాహుబలి' - 'శాతకర్ణి'లాంటి సినిమాలు చేయమని అడగాలని అంటూ చిరంజీవిపై అన్యాపదేశంగా మరొక చురక అంటించాడు. ఇప్పుడు వర్మ చేసిన ట్విట్స్ మెగా అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఆయన చేసిన ట్వీట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు.

వెటకారమా

ఖైదీ నెంబర్ 150 కొత్త పోస్టర్ తో చేసిన ఈ ట్వీట్ మెగా అభిమానులను వెటకారం చేస్తూ సాగింది. జేమ్స్ కామరాన్, క్రిష్టపర్ నోలన్ వంటి వారు కూడా ఇదిచూసి డిప్రెషన్ లోకి వెళ్తారని ఆయన వెటకారం చేసారు.

మండదేంటి

అంతేనా.. 'నిజమైన కత్తికన్నా మెగా షార్ప్ ట్రైలర్‌గా క్రిష్ "గౌతమీపుత్ర శాతకర్ణి" కనిపిస్తోంది' అంటూ వర్మ ట్విట్ చేశాడు.

సంక్రాంతి విజేతగా..

‘‘శాతకర్ణి' బరిలోకి దిగిన తర్వాత.. సంక్రాంతి ఫైట్స్‌ ఉండబోవు. చూస్తుంటే వార్‌ వన్‌సైడ్‌లా ఉంది' అని మొదటి ట్వీట్‌ చేశాడు. సంక్రాంతికి ‘ఖైదీ నెంబర్‌ 150', ‘గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే.

అభిమానిగా

‘ఒక మెగా అభిమానిగా చిరంజీవి ‘గౌతమిపుత్ర..' లాంటి సినిమా చేసి తెలుగు సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటున్నాన'ని మరో ట్వీట్‌ చేశాడు.

మెగాస్టార్ కు చెప్పండి

‘మీరు నిజంగా మెగాఫ్యాన్స్‌ అయితే మెగాస్టార్‌కు ‘బాహుబలి', ‘శాతకర్ణి' లాంటి సినిమాలు చేయమని చెప్పండ'అని అభిమానులకు కూడా సందేశం ఇచ్చాడు.

ఈ రచ్చ ఏంటి

శాతకర్ణి ట్రైలర్‌ను పొగడంలో ఆశ్చర్యం లేదు కానీ తన ట్విట్‌లో వాడిన పదాల మధ్య వర్మ కత్తి ప్రస్తావన ఎందుకు తీసుకు వచ్చాడు అన్న కామెంట్స్ ఫిల్మ్ నగర్‌లో చర్చకు దారితీశాయి.

దర్శకుడుని మెచ్చుకుంటూ..

మరోవైపు.. 'శాతకర్ణి' టీజర్‌కు నందమూరి అభిమానుల నుంచి మాత్రమే కాకుండా అన్ని వర్గాల నుండి ప్రశంసలు వస్తున్నాయి. ఈసినిమా కథపై సాధారణ ప్రేక్షకులకు ఎటువంటి క్లారిటీ లేకపోయినా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్‌కు నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు.

English summary
Ram Gopal Varma tweeted: I think this is greatest poster since movies invented .James Cameron Christopher Nolan will go in depression imagining its visual opulence
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu